సెక్స్ కోసం ఆ అమ్మాయి ఎం చేసిందో తెలిస్తే…!

-

ఆ అమ్మాయి పేరు గెమ్మా వాట్స్, వయసు 21. సోషల్ మీడియాలో జేక్ వాటన్ పేరు మీద ఇన్‌స్టాగ్రామ్, స్నాప్ చాట్, ఫేస్‌బుక్ వంటి అకౌంట్లు ఓపెన్ చేసింది. అందరికి మేల్ పర్సన్ గా ప్రచారం చేసుకుంది ఆ అమ్మాయి. మరి వాళ్ళు ఆమెను అబ్బాయి అని నమ్మాలి కదా…? అందుకు ఒక ప్లాన్ వేసింది. జుట్టు ముడివేసుకుని అబ్బాయి మాదిరిగా ఫోటోలు పెట్టేసింది. మరి అందరూ అబ్బాయి అనుకుంటారు కదా.

సోషల్ మీడియాలో 14 ఏళ్ళ లోపు బాలికలకు రిక్వెస్ట్ పెట్టింది. వాళ్ళు మాములుగా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసేసారు. వాళ్ళతో పరిచయాలు పెంచుకుని, స్నేహం చేయడం మొదలుపెట్టి, ప్రేమగా మాట్లాడుతూ వాళ్ళ వ్యక్తిగత విషయాలను తెలుసుకుని, ఇళ్ళకు వెళ్ళడం మొదలుపెట్టింది. వాళ్ళతో శారీరక సంబంధం పెట్టుకోవడం కోసం మత్తు మందులు ఇచ్చి వాళ్ళను అనుభవించేది ఆ ప్రబుద్దురాలు.

వేర్వేరు చోట్ల నలుగురు అమ్మాయిలూ ఆ అమ్మాయి మీద కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నవంబర్ లో ఆమెను అరెస్ట్ చేయగా వించెస్టర్ క్రౌన్ కోర్టు 8 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. ఆమె బాధితుల లిస్టు లో దాదాపు 30 మంది అమ్మాయిల వరకు ఉన్నట్టు తెలిసిన పోలీసులకు మైండ్ పోయింది. అయితే ఆమెపై ఇంకా దర్యాప్తు పూర్తి కాలేదని పోలీసులు అంటున్నారు.
ను

Read more RELATED
Recommended to you

Exit mobile version