భక్తి: ఈ తప్పులు చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి నిలువదు..!

-

కొన్ని కొన్ని మాటలు పెద్దలు చెప్తూ ఉంటారు కానీ మనం కొట్టిపారేస్తూ ఉంటాం. నిజంగా ఈ తప్పులు చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో మన ఇంట్లో నిలువదు అని పండితులు చెప్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం వీటిని తప్పక పాటించాలని లేదు అంటే లక్ష్మీ దేవికి ఆగ్రహం వస్తుందని దీనితో మీ ఇంట్లో ఇబ్బందులు తప్పవని అంటున్నారు.

 

ఎప్పుడు కూడా ఆహారానికి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. దానిని ఎప్పుడూ మనం కోపగించుకోవడం, ఇన్స్టల్ చేయడం లాంటివి చేయకూడదు. ఆహారం విషయంలో ఈ తప్పులు కనుక చేశారు అంటే లక్ష్మీ దేవి ఇంట్లో ఉండదని, ఆమెకి కోపం వస్తుందని దీని వల్ల ఇబ్బందులు తప్పవని, ఆర్థిక సమస్యలు కూడా వస్తాయని అంటున్నారు. అయితే చేయకూడని పనులు ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం..!

విరికిపోయిన వాటిల్లో తినడం:

ఎప్పుడూ కూడా ఆహారాన్ని తీసుకునేటప్పుడు పగిలిపోయిన లేదా విరిగిపోయిన వాటిల్లో పెట్టుకుని తినకూడదు. కాబట్టి మీరు ఇటువంటి వాటిని ఉపయోగిస్తూ ఉన్నట్లయితే వాటిని మానుకోవడం మంచిది. అలానే రావిచెట్టు కింద కూర్చుని భోజనం చేయకూడదు. కాబట్టి ఎప్పుడూ ఈ తప్పులు చేయొద్దు.

దిక్కు వైపు కొంచెం ధ్యాస పెట్టండి:

దిక్కు వైపు కూడా మీరు ప్రాధాన్యత పెట్టండి. లేదు అంటే నెగిటివ్ ఎఫెక్ట్స్ మీకు వస్తాయి. భోజనం చేసేటప్పుడు ఎప్పుడూ కూడా ఉత్తరం వైపు లేదా తూర్పు వైపు కూర్చుని తినడం మంచిది. అలానే భోజనం చేసేటప్పుడు చెప్పులు లేదా షూస్ ని ధరించకూడదు.

అలానే భోజనం తినేటప్పుడు వంట గదిలో తింటే మంచిది. అలానే స్నానం చేసిన తర్వాత మాత్రమే వండండి. భోజనం చేసేటప్పుడు ముందుగా కొంచెం ఆహారాన్ని ఆవులకి, కాకులకి లేదా శునకాలకిపెట్టడం మంచిది అని పండితులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news