వాహనాలపై విద్యుత్‌ తీగలు పెడితే వెంటనే ఆ తప్పు అస్సలు చేయొద్దు.!

-

గురువారం సత్యసాయి జిల్లాలో ఆటోపై విద్యుత్‌ తీగలు తెగిపడి ఐదుగురు సజీనవదహనం అయ్యారు. ఉదయాన్నే ఈ వార్త విని రాష్ట్రం అంతా ఖంగుతింది. ఈ ఘటనలో తప్పు ఎవరిదో పక్కన పెడదాం…ఏదైనా వాహనంపై విద్యుత్తు తీగలు తెగిపడినప్పుడు భయాందోళనకు గురికాకుండా వెంటనే ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసుకుందాం..! చాలమంది వానహం పై తీగలు పడితే వెంటన అందులోంచి బయటకు రావాలి అనుకుంటారు.. కానీ అలా అస్సలు చేయొద్దట.!

వాహనం పై విద్యుత్ తీగలు పడితే బయటకు రాకుండా… వాహనంలోనే ఉండిపోవాలని కేంద్ర విద్యుత్తు పంపిణీ సంస్థ (సీపీడీసీఎల్) సీఎండీ పద్మాజనార్దన్ రెడ్డి సూచించారు. వాహనం తలుపులు తెరచుకుని కిందికి దిగితే విద్యుత్తు షాక్కు గురయ్యే ప్రమాదం ఉంటుందట. ఈ దృష్ట్యా వాహనంలోనే ఉండి 24 గంటలూ పనిచేసే 1912 కాల్ సెంటర్కు ఫోన్ చేసి సమాచారం అందిస్తే విద్యుత్ సిబ్బంది సాయమందిస్తారని ఆయన తెలిపారు. .

వర్షాకాలంలో జూన్ నుంచి ఆగస్టు మధ్య తీవ్ర విద్యుత్తు ప్రమాదాలు జరగణానికి అవకాశముంది. వర్షాల కారణంగా విద్యుత్తు స్థంబాల భూమి తేమగా ఉంటాయి. విద్యుత్తు ఎర్తింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. తేమగా ఉన్న విద్యుత్తు స్తంబాలను కూడా తాకకూడదు.వర్షం జల్లు ఇన్సులేటర్పై పడి నీరు నిలిచిపోతుంది. ఈ కారణంగా కండక్టర్ షార్ట్సర్క్యూట్ కావడానికి అవకాశముంది. అప్పుడు తీగలు తెగి పడే ప్రమాదం ఉంటుంది..

ఏదైనా వాహనంపై విద్యుత్తు తీగలు తెగిపడినప్పుడు వాహనం తలుపు తెరచుకుని బయటకు దిగితే అందులో ఉన్నవారంతా కూడా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. విద్యుత్తు సిబ్బంది సాయం పొందే వరకు వాహనం నుంచి కిందికి దిగకూడదు. ఒకవేళ వాహనంలో ఉండటం ఇబ్బందిగా అనిపిస్తే మాత్రం వాహనం తలుపు కూడా అంటుకోకుండా రెండు కాళ్లతో గెంతుతూ వెళ్లాలి. ఇలా వాహనమున్న ప్రదేశం నుంచి సుమారు 30 అడుగుల దూరం వరకు గెంతుకుంటూ వెళ్లాలి. గెంతుతూ వెళ్లడం ఇబ్బందిగా అనిపిస్తే కాళ్లను పైకి లేపకుండా భూమిపైనే ఉంచుతూ, మెల్లగా ముందుకు కదుపుతూ 30 అడుగుల దూరం వరకు నడవాలి. వాహనం నుంచి మంటలు వచ్చినప్పుడు మాత్రం బయటకు వచ్చేయాలి. కేవలం తీగలు మాత్రం పడి వాహనంకు ఎలాంటి నిప్పు అంటుకోనప్పుడు మాత్రమే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.

గాలుల కారణంగా స్తంబాలు దెబ్బతిని తీగలు. వేలాడుతుంటే అటువైపు వెళ్లకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. తీగలకు దగ్గరకు వెళ్ళినా విద్యుత్తు షాక్కు గురయ్యే ప్రమాదముంది. షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు విద్యుత్తు సామర్థ్యం అనుమతించిన దాని కంటే సుమారు 230 రెట్లు పెరుగుతుందట.

గమనిక: కేంద్ర విద్యుత్తు పంపిణీ సంస్థ (సీపీడీసీఎల్) సీఎండీ పద్మాజనార్దన్ రెడ్డి చేసిన సూచనల మేరకే ఈ కథనం మీకు అందించడం జరిగింది. మనలోకం సొంతంగా రాసింది కాదని గమనించగలరు.

Read more RELATED
Recommended to you

Exit mobile version