వర్కౌట్స్‌ ముందు శిలాజిత్‌ తీసుకుంటే ఇక తిరుగే ఉండదట..!!

-

శిలాజిత్..ఈ పేరు కూడా చాలామందికి తెలిసి ఉండదేమో. దీన్ని సెక్సువల్‌ హెల్త్‌ కోసమే వాడతారని కొందరు అనుకుంటారు.. కానీ దీనివల్ల లాభాలు మాత్రం చాలా ఉన్నాయి. ముఖ్యంగా మీరు డైలీ వ్యాయామం చేసేవాళ్లు అయితే.. శిలాజిత్‌ గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.. ఎందుకుంటే.. వ్యాయామం చేసేముందు ఇది తీసుకుంటే.. బోలెడన్నీ ప్రయోజనాలు పొందొచ్చట..!! కెఫైన్, క్రియటైన్, ఇతర పదార్థాలతో కూడి ఉన్న సప్లిమెంట్ల కంటే శిలాజిత్ చాలా ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు..

వర్కౌట్స్‌ ముందు శిలాజిత్‌ తీసుకోవడం వల్ల లాభాలు..

శిలాజిత్‌లో ఎలక్ట్రోలైట్స్..

శిలాజిత్‌లో శక్తిమంతమైన ఎలక్ట్రోలైట్ ఉంటుంది. శరీరంలో నీటి సమతుల్యత, కండర సంకోచం, జీవక్రియ కోసం ఈ ఎలక్ట్రోలైట్స్ ఉపయోగపడతాయి.. చెమట కారణంగా ఎలక్ట్రోలైట్స్ వెళ్లిపోతాయి. శిలాజిత్‌లో ఉండే అధిక ఖనిజ లవణాలు ఎలక్ట్రోలైట్స్‌ను భర్తీ చేస్తాయి. శారీరక పనితీరును, ఓరిమిని పెంచుతాయట.

అడాప్టోజెన్‌గా పనిచేసే శిలాజిత్..

శిలాజిత్‌ను ఆయుర్వేదంలో దొరికే అడాప్టోజెన్‌గా చెప్తారు.. శారీరక ఒత్తిడి, ప్రభావాలకు శరీరం స్పందించే తీరులో ఇది సహాయపడుతుంది. ఇది ప్రతి వ్యక్తికి వారి నిర్ధిష్ట అవసరాలను బట్టి వేర్వేరుగా సహాయపడుతుంది.

బలాన్ని పెంచే శిలాజిత్

శిలాజిత్‌లో ఫల్విక్ యాసిడ్ కంటెంట్ ఉంటుంది. ఇందులో 45 శాతం ఆక్సిజన్ ఉంటుంది. అందుకే దీనిని ఎనర్జీ బూస్టర్ అని కూడా అంటారు. వర్కవుట్ సమయాల్లో కార్బన్ డయాక్సైడ్, లాక్టిక్ యాసిడ్ పెరగడం వల్ల శ్వాస తీసుకోలేకపోతారు.. కండరాలు నొప్పికి గురవుతాయి. వ్యాయామం వల్ల కలిగే దుష్ప్రభావాలను ఈ శిలాజిత్ తొలగిస్తుంది. క్రమం తప్పకుండా ఫల్విక్ యాసిడ్ తీసుకుంటే కండరాల బలం పెరగడమే కాకుండా, ఓరిమి కూడా పెరుగుతుంది.

కొలాజెన్‌ను ఉత్పత్తి చేసే శిలాజిత్

శిలాజిత్‌ శరీరంలో కొలాజెన్‌ను కూడా ఉత్పత్తి చేస్తుంది. ఇది ఎముకలు, కీళ్లలో సమస్యలను నయం చేస్తుంది. స్మోకింగ్, వృద్ధాప్యం, సూర్యరశ్మిలో ఎక్కువగా ఉండడం, యాంగ్జైటీ, ఒత్తిడి వంటివి శరీరంలో ఫ్రీ రాడికల్స్‌ ఏర్పడతాయి. వీటివల్ల కొలెజాన్ తగ్గుతుంది.. వ్యాయామానికి ముందు శిలాజిత్ తీసుకోవడం వల్ల బలం పెరుగుతుంది. అలాగే ఫోకస్ పెరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది.

ఖనిజ లవణాల శోషణకు..

ఐరన్ లోపంతో ఏర్పడే ఎనీమియా కూడా చాలా సాధారణ రకమైన రక్తహీనత. ఐరన్ సహా అనేక ఖనిజ లవణాలు కలిగి ఉన్న శిలాజిత్ ఎర్ర రక్త కణాల పుట్టుకకు హిమోగ్లోబిన్, మయోగ్లోబిన్ రూపంలో దోహదపడుతుంది. హిమోగ్లోబిన్ ఊపిరితిత్తులకు, శరీరంలోని ఇతర అన్ని టిష్యూలకు ఆక్సిజన్ తీసుకెళుతుంది. అలాగే మయోగ్లోబిన్ కండరాల్లో ఆక్సిజన్‌ను నిల్వ ఉంచుతుంది. కండరాల నొప్పులకు ఆక్సిజన్ చాలా అవసరం.
శిలాజిత్‌ను వైద్యుల సలహాను అనుసరించి మాత్రమే తీసుకోవాలి. అధిక మోతాదు వల్ల దుష్ప్రభావాలు ఉంటాయి.. నాణ్యమైన, ప్యూర్ శిలాజిత్‌ను మాత్రమే వాడాలి. నాణ్యత లేని శిలాజిత్ ఉత్పత్తుల వల్ల ఈ ప్రయోజనాలేవీ ఉండవు. మార్కెట్‌లో నాణ్యమైనవి కంటే.. తక్కువ ధరకు వచ్చవే ఎక్కువగా ఉన్నాయి.. చూడ్డానికి అచ్చం శిలాజిత్‌లానే ఉంటుంది. మీరు మనాలి, కులు లాంటి ప్రాంతాలకు వెళ్లినట్లైతే.. శనక్కాయల పొట్లాలు అమ్మినట్లు కుంకుమపువ్వు, శిలాజిత్‌ అమ్మేస్తారు.. అవి అస్సలు తీసుకోవద్దు.. అవి నాణ్యమైనవి కాకపోవడం అటు ఉంచితే.. చాలా ప్రమాదకరమైనవి.. ఏవేవో రసాయనాలు వాడి వాటిని అలా చేస్తారు..!

Read more RELATED
Recommended to you

Exit mobile version