ఇజ్రాయిల్ పీఎం, మాజీ రక్షణమంత్రికి ఐసీసీ అరెస్ట్ వారెంట్ జారీ

-

ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, మాజీ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ లపై అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. గాజాలో మానవత్వానికి వ్యతిరేకంగా, యుద్ నేరాలకు పాల్పడ్డారనే అభియోగాలపై ఈ వారెంట్లను జారీ చేసింది. ఆకలిని యుద్ధపద్దతిగా ఉపయోగించారిన ఐసీసీ చెప్పింది. వారెంట్ల ప్రకారం.. ఐసీసీ 122 సభ్య దేశాల భూభాగంలోకి నెతన్యాహు, గాలెంట్ ప్రవేశిస్తే వారిని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది.

గత ఏడాది అక్టోబర్ 07న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ పై దాడులు చేసి 1200 మందిని హతమార్చారు. 240 మంది వరకు ఇజ్రాయిలి బందీలను గాజాలోకి పట్టుకెళ్లారు. ఈ దాడి తరువాత నుంచి ఇజ్రాయిల్ గాజాలోని హమాస్ పై యుద్ధం చేస్తోంది. ఈ యుద్ధంలో హమాస్ మిలిటెంట్లతో పాటు సాధారణ ప్రజలు కూడా మరణించారు. ఇప్పటికే 44,000 కన్నా ఎక్కువ మంది చనిపోయారు. మరోవైపు 101 మంది ఇజ్రాయిలీ బందీలు ఇంకా గాజాలోనే ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version