మీ ఇంట్లో మంచి జరిగితే.. మీ బిడ్డకు తోడుగా నిలవండి : సీఎం జగన్

-

నేడు చిలకలూరిపేటలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ నీ ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. నవరత్నాలతో మీ బిడ్డ ఎదురుగా వస్తుంటే, అక్క చెల్లెమ్మల నుంచి వస్తున్న మద్దతును చూసి తట్టుకోలేక తోడేళ్లు అన్నీ ఒకటవుతున్నాయని అన్నారు. తనకి అంగ బలం, అర్థ బలం, మీడియా బలం లేవని.. దేవుడి దయ, ప్రజల ఆశీస్సులు ఉన్నాయన్నారు.

తాను పొత్తులపై ఆధారపడనని.. తనకి ఎవరితోనైనా పొత్తు ఉంది అంటే అది ప్రజలతో మాత్రమే అన్నారు. కారణం తనకి కుయుక్తులు చేతగావని, అబద్ధాలు చెప్పలేనని, మోసం చేయలేనన్నారు. అందుకే ప్రతి విషయంలోనూ ఆలోచనలు చేయాలని విజ్ఞప్తి చేశారు. మీ ఇంట్లో మంచి జరిగిందా? లేదా? అన్నది కొలమానంగా తీసుకోవాలని.. మీ బిడ్డకు మీరే తోడుగా నిలవాలని కోరారు. మీ ఇంట్లో మంచి జరిగితే మీ బిడ్డకు తోడుగా నిలవాలని ప్రజలను కోరారు సీఎం జగన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version