అదృష్టం కలిసిరావాలంటే ఈ ఒక్క పని చెయ్యాల్సిందే..?

-

ప్రతి మనిషి జీవితంలో అనుకూలంగా పరిస్థితులు ఉంటాయి.. వాస్తు ప్రభావం మనుషులపై ఎక్కువగానే ఉంటుంది..ఆర్థికంగా, ఆరోగ్యం పరంగా కావొచ్చు..వాటికి వాస్తు శాస్త్రంలో పరిష్కార మార్గాలు కూడా ఉన్నాయి. వాస్తు శాస్త్రంలో చెప్పే ఆ వాస్తు విషయాలను పరిహారాలను పాటించడం వల్ల వ్యక్తి జీవితాన్ని సంతోషంగా ఉంచుకోవడంతో పాటు, ఆర్థికంగా కూడా అనేక రకాల మార్పులను గమనించవచ్చు. ఒకవేళ ఇంట్లో వాస్తు దోషాలు ఏవైనా ఉంటే వాటిని ఎలా తొలగించుకోవాలో అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఒక వ్యక్తి జీవితంలో గ్రహాలు బలహీనంగా ఉంటే ఎంత సంపాదించినా చేతిలో మిగలకపోగా దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది. దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవడానికి ఉదయాన్నే స్నానం చేసే సమయంలో మనం స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసుకొని స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల పరిహారం మీ జాతకంలో ఉన్న బృహస్పతి గ్రహాన్ని బలపరుస్తుంది. అలాగే విష్ణువు ఆశీర్వాదం కూడా లభిస్తుంది. అలాగే హనుమంతుడు తన భక్తులను సమస్యల నుంచి గట్టి ఎక్కిస్తాడని చాలామంది నమ్ముతూ ఉంటారు.. అందుకే పంచముఖ ఆంజనేయ స్వామిని నిత్యం పూజించాలి..

మంగళవారం పంచముఖి హనుమంతుడి ముందు దీపం వెలిగించడం ద్వారా ఇంట్లో సంపద పెరుగుతుంది. అలాగే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ నెలకొని ఉంటే రోజూ సాయంత్రం తులసి దగ్గర దీపం వెలిగిస్తే చాలా మంచిది. క్రమం తప్పకుండా పూజ చేసేటప్పుడు శంఖం,గంట శబ్దాలను చేయడం వల్ల వ్యక్తి ఇంట్లో పాజిటివ్ ఎనర్జి ఉంటుంది.. అలాగే కుటుంబం అంత ఆరోగ్యంగా ఉంటారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version