భారత దేశంలోని విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్‌ను క్యూఎస్ ఆసియా విడుదల చేసింది. ఈ సంవత్సరం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఢిల్లీ ఐఐటీ బాంబేను అధిగమించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. గతేడాది ఆసియాలో 46వ స్థానంలో ఉన్న ఐఐటీ ఢిల్లీ, 44వ స్థానానికి ఎగబాకింది. ఆ తర్వాతి స్థానాల్లో ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఖరగ్ పూర్, ఐఐఎస్‌ఈ బెంగళూరు, ఐఐటీ కాన్పూర్, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, ఐఐటీ గౌహతి, ఐఐటీ రూర్కీ, జేఎన్‌యూ ఢిల్లీ ఉన్నాయి.
పైన చెప్పబడిన పలు యూనివర్సిటీల్లో చదివిన వారంతా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్నత స్థానాల్లో రాణిస్తున్నారు. మనదేశంలో ప్రధానంగా ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే, ఐఐటీ ఖరగ్ పూర్ వర్సిటీల నుంచి చదివన వారు పలు అంతర్జాతీయ సంస్థలకు సీఈవోలుగా కొనసాగుతున్నారు. ప్రస్తుత గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఐఐటీ ఖరగ్ పూర్ నుంచి డిగ్రీ పట్టా పొందిన విషయం తెలిసిందే.