హైదరాబాద్‌కు చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)కి చెందిన పరిశోధకులు కోవిడ్ 19 ఫలితాన్ని వేగంగా అందించే ఓ నూతన తరహా టెస్ట్ కిట్‌ను తయారు చేశారు. ఈ కిట్ కేవలం 20 నిమిషాల్లోనే కరోనా ఫలితాన్ని ఇస్తుంది. ప్రస్తుతం కోవిడ్ 19 టెస్టింగ్‌కు ఉపయోగిస్తున్న రివర్స్ ట్రాన్‌స్క్రిప్షన్ పాలీమరేజ్ చెయిన్ రియాక్షన్ (ఆర్‌టీ-పీసీఆర్) పద్ధతి కాకుండా నూతన తరహా విధానం ద్వారా ఈ టెస్ట్ కిట్ పనిచేస్తుందని వారు తెలిపారు.
ఇక సైంటిస్టులు డెవలప్ చేసిన ఈ టెస్ట్ కిట ధర రూ.550 మాత్రమేనని దీంతో ప్రస్తుతం చేస్తున్న ఒక్కో కరోనా టెస్టుపై రూ.350 వరకు ఆదా అవుతుందని తెలిపారు. పెద్ద మొత్తంలో కిట్లను తయారు చేస్తే ఎంతో డబ్బును, సమయాన్ని ఆదా చేయవచ్చని తెలిపారు. కాగా హైదరాబాద్‌లోని ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీలో ఈ టెస్టు కిట్లతో క్లినికల్ ట్రయల్స్ చేపట్టామని.. ఈ క్రమంలో వీటికి పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నామని.. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నుంచి అనుమతి రావాల్సి ఉందని తెలిపారు.
కాగా ఇదే విషయంపై ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ శివ్ గోవింద్ సింగ్ మాట్లాడుతూ.. తాము కేవలం 20 నిమిషాల్లోనే ఫలితాన్నిచ్చే నూతన కోవిడ్ 19 టెస్టు కిట్‌ను డెవలప్ చేశామని, దీని సహాయంతో కరోనా లక్షణాలు కనిపించినా, కనిపించకపోయినా.. వ్యక్తులకు కరోనా ఉంటే వెంటనే తెలుసుకోవచ్చని అన్నారు. ఇక ఈ కిట్‌ను ఎక్కడికంటే అక్కడికి సులభంగా తీసుకెళ్లవచ్చని అన్నారు. దీంతో కరోనా టెస్టులను మరింత వేగంగా, ఒకేసారి ఎక్కువ మందికి చేయవచ్చని తెలిపారు.