తనపై వచ్చిన ఆరోపణలపై మరోసారి వివరణ ఇచ్చారు కరాటే కల్యాణి. నేను పాపను దత్తత తీసుకోలేదు.. పాప తల్లిదండ్రులు మాతో పాటే ఉంటున్నారని అన్నారు. ఒకవేళ నేను దత్తత తీసుకుంటే లీగల్ గానే తీసుకుంటాను అన్నారు కల్యాణి. నాకు అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు.. అసలు నోటీసులు ఇవ్వకుండా మా ఇంటి పైకి విచారణ పేరుతో వచ్చారని అన్నారు.
మా అమ్మ, తమ్ముడు ఆత్మహత్య చేసుకుంటామని అన్నారు.. మనం తప్పు చేయలేదు అని వారికి ధైర్యం చెప్పాను అన్నారు కల్యాణి. నాపై ఎవరైతే నిరాధారమైన ఆరోపణలు చేశారో వారిని తొందరలోనే లీగల్ గా ఎదుర్కొంటాను అన్నారు. నేను బీసీ బిడ్డను.. నన్ను రాజకీయంగా ఎదుర్కొనలేక ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు కరాటే కళ్యాణి. నేను ఎప్పుడు విచారణకు రమ్మన్నా కూడా వస్తాను అని అధికారులకు చెప్పానని అన్నారు. నాపై ఆరోపణలు చేసిన వారిలో కొందరు రాజకీయ నాయకులు, అధికారులు కూడా ఉన్నారని చెప్పారు కరాటే కళ్యాణి.