నలభైలోకి ప్రవేశిస్తున్న మహిళలు రోగనిరోధక శక్తి పెంపొందించుకోండిలా..

-

మహమ్మారి కారణంగా రోగనిరోధక శక్తి పెంచుకోవాలని అందరికీ అర్థమైంది. కళ్ళకి కనిపించని సూక్ష్మజీవి ప్రపంచం మొత్తాన్నే వణికించింది. ఇప్పుడిప్పుడే వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తున్నప్పటికీ రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం తప్పనిసరి. సాధారణంగా యవ్వనంలో ఉన్నవారికి ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఇమ్యూనిటీ తగ్గుతూ వస్తుంది. ఐతే నలభైలోకి ప్రవేశించే మహిళలు, రోగ నిరోధక శక్తిని ఎలా పెంపొందించుకోవాలో ఇక్కడ చూద్దాం.

రోగనిరోధక శక్తి పెంచుకుని ఆరోగ్యంగా ఉండాలనుకునే మహిళలు, వ్యాయమం తప్పకుండా చేయాలి. మసాలా ఆహారాలు తినకూడదు. పొగతాగడం, మద్యం సేవించడం వంటి అలవాట్లు మానేయాలి.

చియా గింజలు

ఈ విత్తనాలో ప్రోటీన్ అధికశాతం ఉంటుంది. మెగ్నీషియం తగినంతగా ఉండి ఎముకలకి బలాన్ని చేకూరుస్తాయి.

సిట్రస్ ఫలాలు

నారింజ, ఉసిరి, బత్తాయి, నిమ్మ మొదలగు ఫలాల్లో విటమిన్ సి, పుష్కలంగా ఉంటుంది. దీని కారణంగా ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు మెదడుకి ఆరోగ్యాన్ని చేకూర్చడంతో పాటు చర్మ సంరక్షణకి ఉపయోగపడతాయి. బరువు తగ్గాలనుకునే వారు వారి ఆహారంలో సిట్రస్ ఫలాలని భాగం చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.

గుడ్లు

గుడ్డులో విటమిన్ డి తోపాటు ఐరన్ అధికంగా ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ రెండు పోషకాలు మహిళలకి సరిగ్గా అందవు. అందువల్ల వయసు పెరుగుతున్న మహిళలు ఆరోగ్యంగా ఉండడానికి గుడ్లని ఆహారంలో భాగంగా చేసుకోవాలి. మరో విషయం గుడ్లలో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది.

చేప

సాల్మన్ చేపలో శరీరానికి మేలు చేసే కొవ్వు ఉంటుంది. దీన్ని రోజువారి ఆహారంలో తీసుకుంటే గుండె పనితీరు మెరుగవుతుంది. ఆడవాళ్లలో కావాల్సిన హార్మోన్లు సమృద్ధిగా విడుదల అవుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version