ప్రజా వినతులను పూర్తిస్థాయిలో పరిష్కరించడమే లక్ష్యంగా మార్చి 23 నుంచి ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ‘స్పందన’లో వచ్చిన ఆర్జీల ట్రాకింగ్, పర్యవేక్షణ, పరిష్కారంపై ప్రతివారం అధికారులు సమీక్ష నిర్వహిస్తారు.
తర్వాత సీఎం జగన్ కు నివేదికలు అందిస్తారు. ఎన్నికల కోడ్ కారణంగా ఆలస్యమైన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ను ఏప్రిల్ 6 నుంచి పూర్తిస్థాయిలో అమలు చేయనుంది. అటు ఏపీ విద్యార్థులకు షాక్ తగిలింది. జగనన్న విద్యా దీవెన మరోసారి వాయిదా పడింది. జగనన్న విద్యాదీవెన పథకం కింద ఇవాళ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాల్సి ఉండగా, అనివార్య కారణాలతో ప్రభుత్వం మళ్ళీ వాయిదా వేసింది.
తదుపరి తేదీని త్వరలో ప్రకటిస్తామని జిల్లాలకు సమాచారం పంపింది. తోలుత గత నెల 28న విడుదల చేస్తామని ప్రకటించి, ఈ రోజుకు వాయిదా వేసిన విషయం తెలిసిందే. 2022-23 గాను అక్టోబర్, నవంబర్, డిసెంబర్ త్రైమాసికానికి రూ.700 కోట్లు చెల్లించాల్సి ఉంది. జగనన్న విద్యా దీవెన మరోసారి వాయిదా పడటంతో.. ఏపీ విద్యార్థులు తీవ్ర అసహానానికి గురి అవుతున్నారు.