ఆకట్టుకుంటున్న ‘1134’ ట్రైలర్..!

-

ప్రస్తుతం కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న సినిమాలకు ఎక్కువ ఆదరణ లభిస్తోంది. ఇలాంటి ఓ డిఫరెంట్ ప్రయోగమే 1134. కాస్త డిఫరెంట్ టైటిల్ తో థ్రిల్లింగ్ ప్రధానంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు నూతన దర్శకుడు శరత్ చంద్ర తడిమేటి. శాన్వీ మిడియా బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాకి భరత్ కుమార్ పాలకుర్తి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రాబరీ నేపథ్యంలో బలమైన కథా, కథనంతో ఈ మూవీ సాగనుందని ఫస్ట్ లుక్ పోస్టర్, ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది.

 

దాదాపు 2 నిమిషా 28 సెకన్ల నిడివితో వచ్చిన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. సొంతంగా తనే కథ రాసుకొని హై టెక్నికల్ వాల్యూస్ తో అన్ని వర్గాల ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యేలా ఈ మూవీని తెరకెక్కించారు డైరెక్టర్ శరత్ చంద్ర తడిమేటి. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్లు ప్రకటించారు. ఈ సినిమాని డిసెంబర్ 15న విడుదల చేయబోతున్నట్టుగా యూనిట్ తెలిపింది. రాంధుని క్రియేషన్స్, శాన్వీ మీడియా బ్యానర్ లపై తెరకెక్కుతున్న ఈ 1134 చిత్రంలో కృష్ణ మడుపు, గంగాధర్ రెడ్డి, ఫణిశర్మ, ఫణి భార్గవ్, నర్సింగ్ వాడేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ మురళీ కార్తికేయ సంగీతం అందిస్తున్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version