మాట నిలబెట్టుకున్న రేవంత్ రెడ్డి.. ఆ ఫైల్ పైనే రెండో సంతకం..!

-

తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు రేవంత్ రెడ్డి. డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క, మంత్రులుగా మొత్తం11 మంది ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత  తాను ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటలను నిలబెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను తప్పక అమలు పరిచే అభయ హస్తంపై తొలి సంతకం చేశారు.

అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దివ్యాంగురాలైన రజినీకి ఉద్యోగం ఇస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. సీఎంగా రజినీ ఉద్యోగ నియామక ఫైల్ పై రెండో సంతకం చేశారు. అనంతరం ఉద్యోగ నియామక పత్రాన్ని దివ్యాంగురాలు అయినటువంటి రజినీకి అందజేశారు. అదేవిధంగా జ్యోతిరావు పూలే ప్రజా భవన్ లో శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రజా దర్భార్ నిర్వహిస్తామని.. దానికి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version