ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలకు ముప్పు..కీలక ఆదేశాలు జారీ చేసిన పాక్ ప్రధాని!

-

పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు దుండగుల నుంచి బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది.తమ నేత ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఆయన పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో పాక్ ప్రభుత్వం అప్రమత్తం అయింది.ఇమ్రాన్ కు పూర్తిస్థాయిలో భద్రతను కల్పించాలని ఆ దేశ ప్రధాని శెహెబాజ్ షరీఫ్ ఆదేశించారు.ఇమ్రాన్ భద్రత విషయంలో తక్షణమే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీ చేశారు.ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ భద్రతను కల్పించాలని పేర్కొన్నారు.

ఈరోజు ( సోమవారం) రాత్రి లాహోర్ లో ఇమ్రాన్ ఖాన్ ఒక ర్యాలీని నిర్వహించనున్నారు.ర్యాలీకి సిద్ధమవుతున్న సమయంలో ఆయనకు బెదిరింపులు వచ్చాయి.దీంతో వర్చువల్ గా ర్యాలీని ఉద్దేశించి మాట్లాడాలని ఆయన మద్దతుదారులు కోరారు.వారి సూచనలను ఇమ్రాన్ తిరస్కరించారు.ర్యాలీలో పాల్గొనేందుకు ఆయన సిద్ధమయ్యారు.ఈ నేపథ్యంలో పాక్ ప్రభుత్వం ఆయన భద్రతకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version