పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీపై నిషేధం

-

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్‌పై నిషేధం విధించాలని పాక్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ పార్టీని నిషేధిత సంస్థగా ప్రకటించే ప్రక్రియను ప్రారంభించేందుకుగానూ న్యాయ నిపుణులను సంప్రదించాలని పాక్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు పాక్ మంత్రి రాణా సనావుల్లా తెలిపినట్లు స్థానిక వార్తాసంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. జమాన్‌ పార్కులో ఉగ్రవాదులు దాక్కున్నారని.. ఇమ్రాన్ నివాసంలో ఆయుధాలు, పెట్రోల్ బాంబులు చిక్కాయని సనావుల్లా తెలిపారు. ఉగ్రవాద సంస్థగా PTI పై కేసు నమోదు చేయడానికి ఇవే సాక్ష్యాలు అని ఆయన చెప్పారు.

మరోవైపు తోషఖానా కేసులో విచారణకుగానూ శనివారం రోజున పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఇస్లామాబాద్‌కు చేరుకున్న వేళ ఘర్షణ వాతారవణం తలెత్తింది. కోర్టు ప్రాంగణం వెలుపల ఆయన మద్దతుదారులు, పాకిస్థాన్ తెహ్రీక్- ఏ- ఇన్సాఫ్(PTI) పార్టీ శ్రేణులు విధ్వంసం సృష్టించారు. ఈ క్రమంలో 25 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారు.

జ్యుడిషియల్ కాంప్లెక్స్ వెలుపల విధ్వంసం, భద్రతా సిబ్బందిపై దాడి, అలజడి సృష్టించడం వంటి చర్యలకు కారణమైనందుకుగానూ ఇమ్రాన్‌తోపాటు డజనుకు పైగా పీటీఐ నేతలపై పోలీసులు ఉగ్రవాద కేసు నమోదు చేశారు. దీంతో ఇమ్రాన్ పై ఇప్పటివరకు దాఖలైన కేసుల సంఖ్య 97కు పెరిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version