ఏపీలో ప్రభుత్వ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రాళ్లపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వంట మనుషులు అమానవీయకరంగా ప్రవర్తించారు. విద్యార్థులతో తమ పనలన్నీ చేయించుకుంటున్నారు. ఈ విషయం శుక్రవారం తాజాగా వెలుగులోకి వచ్చింది.
జగ్గంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సరిపడా సిబ్బంది ఉన్నా విద్యార్థులతో వంట పనులు చేయిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా విద్యార్థులకు కుళ్ళిన గుడ్లును భోజనంలో పెడుతున్నారని ఫిర్యాదులు అందాయి. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో వారు సీరియస్ అవుతున్నారు. పరిస్థితులను చక్కదిద్దే దిశగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.
జగ్గంపేట మండలం కాట్రాళ్లపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వంట నిర్వాహకుల నిర్వాకం.
సరిపడా సిబ్బంది ఉన్న విద్యార్థులతో పనులు చేయించడం విశేషం.
కుళ్ళిన గుడ్లును విద్యార్థులకు పెడుతున్నరుని. పరిస్థితులను చక్కదిద్దే దిశగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు తల్లిదండ్రులు… pic.twitter.com/rdht77ryDU
— ChotaNews (@ChotaNewsTelugu) November 15, 2024