మధిర నియోజక వర్గంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేస్తున్న పాదయాత్ర నాలుగో రోజుకు చేరుకుంది. ఈ పాదయాత్రలో అధికార టీఆర్ఎస్ పార్టీపై భట్టి విక్రమార్క తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో మిషన్ భగీరథ అనే పేరుతో పథకం తీసుకువచ్చి.. రూ. 50 వేల కోట్లను దోచుకున్నారని ఆరోపించారు. తెలంగాణ లో మిషన్ భగీరథ తీసుకువస్తే.. దీనికి ముందే మధిర నియోజక వర్గంలో ప్రతి ఇంటికి మంచి నీటిని అందించామని అన్నారు.
రాష్ట్రంలో ఇంకా చాలా మంది ఇళ్లలకు మంచి నీరు అందుబాటులో లేదని ఆరోపించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూర్ చేస్తే.. ఇప్పటి వరకు ఆ పనులు పూర్తి కాలేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అభివృద్ధిని కేసీఆర్ దూరం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలను పట్టించుకోకుండా.. సీఎం కేసీఆర్ నిద్ర పోతున్నారని భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు.