కొన్ని దేశాల్లో కుక్కలను పెంచటం అంత ఈజీకాదు..చట్టాలను అధిగమిస్తే జైలుశిక్ష కూడా తప్పదట..!

-

పెంపుడు జంతువులను పెంచటం ఈమధ్య ఫ్యాషన్ అయిపోయింది. టైం పాస్ కి కొందరు, మూగజీవుల మీద ప్రేమతో కొందరు మొత్తానికి ఐతై ఎక్కువగా కుక్కలను పెంచుతుంటారు. కానీ మీకు తెలుసా మన ఇంట్లో ఉం‍డే కుక్కలే కదా అని వాటిని లైట్ తీసుకుని మీకు కుదిరినప్పుడు ఫుడ్ పెట్టటం, తీరిక ఉన్నప్పుడు బయటకు తీసుకెళ్లటం వంటివి చేయకూడదట. వాటిని నిర్లక్ష్యం చేస్తే కఠిన శిక్షలు తప్పవట. వామ్మో ఇదెక్కడి గోలరా అనుకుంటున్నారా ..కొన్ని దేశాల్లో కుక్కకు సంబంధిత చట్టాలను ఉల్లంఘించినందుకు, భారీ జరిమానాలతో పాటు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది.. పెంపుడు కుక్కల విషయంలో ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఎలాంటి చట్టాలు ఉన్నాయో చూద్దాం. మీరైతే కచ్చితంగా వీటిని తెలుసుకుని షాక్ అవుతారు.

1. డాగీని రోజుకు 3 సార్లు బయటకు తీసుకెళ్లాలి

ఇటాలియన్ నగరమైన టురిన్‌లోని చట్టం ఏం చెబుతుందంటే…యజమాని తన కుక్కను రోజుకు కనీసం 3 సార్లు నడకకు తీసుకెళ్లాలట.. అలా చేయడంలో విఫలమైతే 500 యూరోల జరిమానా విధిస్తారు. యజమాని తన కుక్కను ఫిట్‌గా ఉంచుకోవడానికి ప్రతిరోజూ వ్యాయామం చేయాలనే నియమం కూడా ఉంది. అందం పేరుతో తన కుక్క తోకను కూడా కత్తిరించకూడదు.

2. శాకాహారిని చేయకూడదు

కుక్క అంటే ముక్కను ఇష్టపడే జీవి. అలాంటి కుక్కను శాకాహారం చేయాలని ప్రయత్నిస్తే భారీ జరిమానా విధించే చట్టం బ్రిటన్‌లో ఉంది. లంకాషైర్ ఒడ్డున నివసిస్తుంటే, పోలీసుల అనుమతి లేకుండా కుక్క మొరగదని చట్టం కూడా ఉంది. అనుమతి లేకుండా చనిపోయిన కుక్కను కాలిస్తే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మీ పెంపుడు కుక్క చనిపోయినప్పుడు మీరు దానిని ఇంటిలో కాకుండా మరెక్కడా పాతిపెట్టకూడదు.. కుక్కను పాతిపెట్టే ఇల్లు మీ సొంతదై ఉండాలి.

3. పెంపుడు కుక్క 14 అంగుళాల కంటే ఎక్కువ ఉండకూడదు

మనదేశంలో ఓ పెద్దపెద్ద కుక్కలను పెంచేస్తుంటారు. అవి ఒకోసారి కుక్కలా సింహాల్లా అనేలా ఉంటాయి. చైనాలో కుక్కల పెంపకం పై పెద్దగా ఆంక్షలు లేవు కానీ, ఇంటికి ఒక కుక్క మాత్రమే ఉండాలంట. దాని ఎత్తు కూడా 14అంగుళాలకు మించి ఉండకూడదు. ఒక వ్యక్తి రెండు కుక్కలను పెంటాడంటే..అతనికి అధికారులు జరిమాన విధిస్తారట. అనుమతి లేకుండా కుక్కలకు స్టెరిలైజేషన్ చేయకూడదు. అది చట్టవిరుద్ధమట.

4. పెంచినందుకు టాక్స్ కట్టాలి

జర్మనీలో అయితే… కుక్కను పెంచినందుకు ప్రతి నెలా పన్ను చెల్లించాలి. కుక్క సైజును బట్టి ఈ పన్ను ఉంటుందట.. అంటే చిన్న కుక్కను పెంచుకుంటే తక్కువ పన్ను చెల్లించాల్సిందే. అందుకే అక్కడ చాలా మంది పన్నులు ఎగవేయడానికి చిన్న కుక్కను పెంచుకోవడానికి ఇష్టపడుతుంటారు.

5. సర్టిఫికెట్ లేకుండా సంతానోత్పత్తి చట్టవిరుద్ధం

నార్వే జంతు సంరక్షణ చట్టం ప్రకారం పశువైద్యుడు ఒక సర్టిఫికేట్ జారీ చేయకపోతే పెంపుడు కుక్క సంతానోత్పత్తి చేయడం చట్టవిరుద్ధం. ఎవరైనా అనుమతి లేకుండా ఇలా చేస్తే భారీ జరిమానా విధిస్తారట. స్విట్జర్లాండ్‌లో ఒక చట్టం ఉంది.. అక్కడ అన్ని పెంపుడు జంతువులకు వారి స్వంత భాగస్వామి ఉండాలి. దీనితో కుక్కను ఉంచడానికి వ్రాత, మౌఖిక పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. అప్పుడే డాగ్ పెట్ సర్టిఫికెట్ ఇస్తారట.

6. పర్మిషన్ లేకుండా డాగీ బర్తడే పార్టీకూడా చేయొద్దట

యునైటెడ్ స్టేట్స్‌లోని వివిధ రాష్ట్రాలలో కుక్కలను పెంచుకోవడానికి సంబంధించి వేర్వేరు చట్టాలను ఉన్నాయి. ఓక్లహోమా రాష్ట్రంలో నగర మేయర్ వ్రాతపూర్వక అనుమతి లేకుండా డాగీ బర్త్‌డే పార్టీని నిర్వహించకూడదనే చట్టం ఉంది. ఎందుకంటే ఏదైనా ప్రైవేట్ ఆస్తిలో 4 కంటే ఎక్కువ కుక్కలు ఒకే దగ్గర ఉం‍డకూడదట. ఒక నివాసి 4 కంటే ఎక్కువ కుక్కలను అక్కడ ఉంచినట్లయితే, అతనికి $ 200 వరకు జరిమానా విధిస్తారు.

ఇలాంటి చట్టాలు ఉన్నాయి. మనదేశంలో అయితే కుక్కలను పెంచేందుకు ఎలాంటి చట్టాలు లేవు. ఒకవేళ ఇలా పన్నులు కట్టాలి, రోజూ తిప్పాలి అనే నియమాలు పెడితే జంతుప్రేమికులు పరిస్థితి ఏంటో.

Read more RELATED
Recommended to you

Exit mobile version