ఆ విష‌యంలో నాడు ఎన్టీఆర్‌కు ఎదురైన ప‌రిస్థితే జ‌గ‌న్‌కు ఎదుర‌వుతుందా..?

-

2019 సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజార్టీతో వైసీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన సంగతి అందరికీ విదితమే. ఇక తన కేబినెట్‌లో చాలా మంది కొత్తవారికి అవకాశమిచ్చారు జగన్. ఈ నేపథ్యంలోనే రెండేళ్ల పాటు వారి పనితీరును పరిశీలించాక మంత్రి వర్గ విస్తరణలో మార్పులు, చేర్పులు ఉంటాయని ఆనాడే చెప్పాడు. ఈ క్రమంలోనే ఏపీలో రాజకీయ వర్గాల్లో ఇప్పుడు జగన్ కేబినెట్‌పైన చర్చ జరుగుతున్నది. త్వరలో కొంత మంది వైసీపీ మంత్రులు పదవుల నుంచి తప్పించబడుతారని, ఇంకొందరు కొత్తవారు కేబినెట్‌లోకి వస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది.

పలువురు కొత్త వారికి జగన్ తన మంత్రి వర్గంలో చోటు ఇచ్చే చాన్సెస్ ఉంటాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఉమ్మడి ఏపీ దివంగత మాజీ సీఎం ఎన్టీ రామారావు ఒకే సారి 30 మంది మంత్రులకు ఉద్వాసన పలికారు. ఈ క్రమంలోనే అందరూ కొత్తవారిని తన కేబినెట్‌లోకి తీసుకుని చరిత్ర సృష్టించారు. నాడు కేబినెట్‌లోకి తీసుకోబడిన ఇప్పటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి ఉన్నారు.అయితే, ఇలా చేయడం వల్ల టీడీపీ సీనియర్లు ఆ తర్వాత పార్టీకి పెద్ద నష్టం చేశారనే వాదనలు ఉన్నాయి.

జగన్ విషయంలోనూ ఇదే జరిగే చాన్సెస్ ఉన్నాయా? అనేది కొంత కాలం తర్వాతే తేలనుంది. చూడాలి.. ఏం జరుగుతుందో మరి.. వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్‌గా పేరు తెచ్చుకున్న ఎమ్మెల్యే రోజా ఈ సారి జగన్ కేబినెట్‌లో కచ్చితంగా ఉండబోతుందని వైసీపీ వర్గాల్లో వినబడుతోంది. ఇప్పటికే ఆమెకు బెర్త్ కన్ఫర్మ్ అయినట్లు, శాఖ కూడా కేటాయించినట్లు వార్తలొస్తున్నాయి. చూడాలి మరి.. ఈ సారైనా రోజా మంత్రి అయ్యనో లేదో..

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version