పాఠశాలల రీ ఓపెనింగ్ పై కేసీఆర్ సర్కార్ కీలక ఆదేశాలు

-

స్కూల్స్ రీ ఓపెన్ పై మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. 17 నెలలుగా వ్యవస్థలు అన్ని అతలాకుతలం అయ్యాయని.. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ఇప్పటి వరకు ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించామన్నారు. వైద్య శాఖ నివేదిక ప్రకారమే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం చేస్తున్నామని.. 60 లక్షల మంది విద్యార్థులు పాఠశాలలకు రాబోతున్నారని పేర్కొన్నారు. సర్పంచ్ ఆధ్వర్యంలో ప్రతీ పాఠశాలను పరిశుభ్రంగా ఉంచేలా చూడాలని సీఎం కేసీఆర్ సూచించారని.. అంగన్ వాడీ స్కూల్స్ కూడా ప్రారబిస్తున్నామని తెలిపారు.

డీఈవోలు అందర్ని సమన్వయం చేసుకోవాల్సి ఉంటుందని.. సర్పంచ్, కౌన్సిలర్లు, మున్సిపల్ ఛైర్మన్, మేయర్లు అందరూ బాధ్యతగా తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రతిరోజూ పాఠశాలల్లో ఏఏ పనులు చేశారో రాష్ట్ర అధికారులకు నివేదిక ఇవ్వాలని.. కోవిడ్ పాజిటివ్ వస్తే టెస్టు లు చేసి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలన్నారు. కోవిడ్ నిబంధనల ప్రకారమే పాఠశాలల నిర్వహణ ఉంటుందని.. తల్లిదండ్రులు పిల్లల ట్రాన్స్ పోర్టు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. స్కూల్ బస్ సానిటైజ్ చేయాలని.. ఆటోల్లో కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పిల్లల ట్రాన్స్ పోర్టు ఉండాలని తెలిపారు.అధికారులు అందరూ విద్యార్థులకు, తల్లిదండ్రులకు ధైర్యం కల్పించాలని పేర్కొన్నారు. ప్రత్యక్ష తరగతులు మాత్రమే నిర్వహిస్తాం… విద్యార్థుల తల్లిదండ్రులు మమ్మల్ని స్కూల్స్ ప్రారంభించాలని కోరుతున్నామన్నారు. ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని.. బస్సుల కండీషన్లు చూసుకోవాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version