మహాభారతంలో అర్జునుడు.. శత్రువు దుర్యోధనుడి నుండి వరం పొందడానికి కారణం..?

-

మహాభారతంలో కౌరవులు పాండవులు ఒకే కుటుంబానికి చెందినవారు అయినప్పటికీ విభేదాల కారణంగా కౌరవులు వందమంది కలిపి.. పాండవులు ఐదు మందిని దూరంగా పెట్టారన్న విషయం మహాభారతం తెలిసిన ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. ఇక ఈ మహాభారతంలో అంతుచిక్కని ఎన్నో రహస్యాలు కూడా ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి శత్రువైన దుర్యోధనుడు నుండి అర్జునుడు ఎలా వరం పొందాడు అని ఈ విషయం గురించి మనం ఇప్పుడు పూర్తిగా చదివి తెలుసుకుందాం.

కురుక్షేత్రం లో భీష్ముడు, ద్రోణచార్యుడు కౌరవుల వైపు వుంటూ పాండవులతో పోరాడుతుండేవారు. ఒకరోజు దృతారాష్ట్రుని కుమారుడయిన దూర్యోదనుడు.. భీష్ముడు దగ్గరకొచ్చి నీవు ఎందుకని పాండవులను చంపడం లేదు. నీకు పాండవులంటే ఎక్కువ ప్రేమ అందుకే చంపడంలేదు అని నిందిస్తాడు. అప్పుడు కోపం వచ్చి భీష్ముడు దుర్యోధనిడికి 5బంగారు బాణాలను మంత్రించి ఇస్తాడు. ఇవి పాండవులు 5మంది పై వేసిన తక్షణమే వారిని ఇవి చంపివేస్తాయని చెప్పి దుర్యోడనికి ఇస్తాడు. భీష్ముణి పై నమ్మకం లేక రాత్రికి బాణాలను నాదగ్గరే పెట్టుకుంటానని చెబుతాడు.ఇదంతా గమనించిన కృష్ణుడు అర్జునుడి దగ్గరికి వెళ్లి దుర్యోదనుడు నీకిచ్చిన వరం ఉపయోగించుకొనే అవకాశం వచ్చింది. ఇప్పుడు వెళ్ళి ఆ బంగారు బాణాలను అడిగి తీసుకురా అని చెబుతాడు. పాండవులు వనవాసం చేసే టప్పుడు ఒక నది వైపున పాండవులు.. మరొకవైపు దుర్యోధనుడు ఉండేవారు. ఆ నదిలో గంధర్వులు నివసించేవారు. నదిలో గంధర్వులు దుర్యోధనుని చంపడానికి చూస్తున్నప్పుడు అర్జునుడు దుర్యోధనుడు ని కాపాడుతాడు.

అప్పుడు దుర్యోధనుడు అర్జునునికి ఒక వరం కోరుకోమని చెబుతాడు. అర్జునుడు సమయం వచ్చినప్పుడు తప్పకుండా వరం కోరుకుంటానని చెబుతాడు.ఆ వరం ఉపయోగించి అర్జునుడు వెళ్లి దుర్యోధనుడు దగ్గర నుంచి ఆ బంగారు ఐదు బాణాలను తీసుకొస్తాడు. దుర్యోధనుడు భీష్ముడి దగ్గరకు వెళ్లి మళ్లీ ఇవ్వమని అడుగుతాడు. కానీ భీష్ముడు అవి ఒక్కసారి ఇవ్వగలం మళ్లీ మళ్లీ ఇవ్వడానికి కుదరదు అని చెబుతాడు. ఇక అలా అర్జునుడు దుర్యోధనుడు నుండి వరం పొందుతాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version