ఆపరేషన్ సింధూర్ మీద ఎవరైనా వివాదాస్పద పోస్టులు పెడితే వారిమీద కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర పోలీస్ యంత్రాంగానికి కీలక ఆదేశాలు జారీచేశారు. పాక్ మీద భారత్ వైమానిక దాడులు నిర్వహించాక.. రాష్ట్రంలో శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం సీఎం రేవంత్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో అత్యవసర మీటింగ్ నిర్వహించి అధికారులకు కీలక ఆదేశాలు జారీచేశారు.
అయితే, ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ మీద తెలంగాణ విద్యా కమిషన్ సలహాదారు సభ్యురాలు సుజాత సూరేపల్లి సెటైరికల్‌గా అనుచిత పోస్ట్ పెట్టారు. ‘సింధూరం అంటే రక్త సింధూరం లాంటిదా? నేనేదో భక్తి, పూజ, శుభానికి సంకేతం అనుకునేదాన్ని.. యుద్ధాలు, శవాలను, శకలాలను మిగులుస్తాయి కానీ శాంతిని కాదు’ అని ఆమె రాసుకొచ్చారు. కాగా, ఇండియన్ ఆర్మీపై మీద అనవసరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించగా.. సుజాత సూరేపల్లిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.