మా దేశంలో టెర్రరిస్టు క్యాంప్స్ లేవు.. లైవ్‌లో పాక్ మంత్రి పరువు తీసిన యాంకర్

-

పాకిస్తాన్ టెర్రరిస్టు క్యాంపులపై ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ హజార్ కుటుంబంతో పాటు మరికొందరు ఉగ్రవాదులు హతం అయ్యారు. అయితే, ఈ విషయంపై ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో పాకిస్థాన్ సమాచార ప్రసారశాఖ మంత్రి అత్తావుల్లా తరార్ మాట్లాడుతూ.. అసలు తమ దేశంలో ఉగ్రవాద శిభిరాలే లేవని బుకాయించే ప్రయత్నం చేశారు.

ఆయన వ్యాఖ్యలకు యాంకర్ లైవ్‌లోనే కౌంటర్ ఇచ్చారు. ‘మీ రక్షణ మంత్రే మూడు దశాబ్దాలుగా అమెరికా కోసం ఈ చెత్తపని చేస్తున్నామని, ఉగ్రవాదాన్ని పోశిస్తున్నామని చెప్పారు.2011లో అమెరికా సైన్యం పాకిస్థాన్‌లో కాల్చి చంపిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ అబోటాబాద్‌లోనే దొరికాడని.. ఆ సమయంలో నేను పాకిస్థాన్ వచ్చానని, బిన్ లాడెన్ పాకిస్థాన్‌లోనే దొరికాడని తనకు తెలుసు అని’ అన్నారు. యాంకర్ వ్యాఖ్యలకు పాకిస్థాన్ మంత్రి ఒక్కసారిగా మౌనం వహించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news