అదిలాబాద్ జిల్లా పరిధిలో ఈరోజు ఘోరం చోటుచేసుకుంది. మండల పరిధిలో గిమ్మ ప్రభుత్వ పాఠశాలలో టెన్త్ క్లాస్ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ క్రమంలో ఈరోజు విద్యార్థులు పరీక్ష రాస్తుండగా ఉన్నట్టుండి తరగతి గది పైకప్పు ఒకసారిగా ఉడి పడిపోయింది. ఈ ప్రమాదంలో పరీక్ష రాస్తున్న విద్యార్థులతో పాటు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడికి కూడా గాయాలు అయ్యాయి.

ఇది గమనించిన తోటి సిబ్బంది వాళ్లందరినీ చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. అదిలాబాద్ జిల్లాలో ఇది చోటుచేసుకుంది మండల పరిధిలో గిమ్మ ప్రభుత్వ పాఠశాలలో ఎగ్జామ్ సెంటర్ గా ఇచ్చారు. అయితే ఏర్పాట్లు కూడా చేశారు కానీ ఇలా జరుగుతుందని ఎవరు ఊహించలేదు పరీక్ష రాస్తున్న విద్యార్థులతో పాటుగా ఉపాధ్యాయుడికి కూడా గాయాలు అయ్యాయి.