ఈసీ నిర్ణయాల వల్లనే హింసాత్మక ఘటనలు.. మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు

-

ఏపీలో జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తునకు సీఈసీ ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఈసీ నిర్ణయంపై మంత్రి బొత్స అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులను మార్చడం వల్లే హింస జరిగిందని ఆరోపించారు. ఈసీ తీసుకున్న తొందరపాటు నియామకాల వల్లే హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని వ్యాఖ్యానించారు. అల్లర్లకు ఈసీ నియమించిన మాజీ ఐపీఎస్ అధికారినే కారణమని చెప్పారు. రాజకీయ కక్షతోనే కొందరు హింసను ప్రేరేపిస్తున్నారని మండిపడ్డారు.

రాజకీయ లబ్దికోసం ఉత్తరాంధ్రలో ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిపై ప్రజలు ఇచ్చిన తీర్పును కోర్టుల ముందు ఉంచుతామన్నారు. రుషికొండలో కట్టిన భవనాలను అధికారిక కార్యకలాపాలకు వినియోగిస్తామని తెలిపారు. మళ్లీ అధికారం తమదేనని.. 175 స్థానాల్లో గెలుస్తామన్నారు. గెలుపుపై నమ్మకం లేకే టీడీపీ మహానాడును రద్దు చేసుకుందని ఎద్దేవా చేశారు. వైసీపీ మద్దతుతోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడుతుందని జోస్యం చెప్పారు. జూన్ 9 తర్వాత జగన్ విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. విశాఖ చాలా అభివృద్ధి చెందుతుందని బొత్స పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version