వైఎస్ వివేకా హత్య కేసు… వైఎస్ షర్మిలకి భారీ ఊరట

-

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ వివేకా హత్య కేసు గురించి ప్రస్తావించిన కేసులో ఏపి కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలకు సుప్రీంకోర్టులో భారీ ఊరట దక్కింది. దీనికి సంబంధించిన కోర్టు ధిక్కారణ కేసులపై తాజాగా సుప్రీంకోర్టు స్టే విధించింది.షర్మిలతో పాటు ఇతరులపైన నమోదైన కేసులపైన కూడా సుప్రీంకోర్టు స్టే విధించింది.

కాగా, వివేకా హత్య కేసుపై వైఎస్ షర్మిల, సునీత ఎన్నికల ప్రచారంలో వైసీపీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆ పార్టీకి చెందిన ఓ నేత కడప జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కడప కోర్టు.. ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేకా హత్య కేసు గురించి మాట్లాడొద్దంటూ షర్మిల, సునీత తదితరులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.అయినప్పటికీ క్యాంపెయినింగ్‌లో వివేకా హత్య కేసు గురించి వైయస్ షర్మిల ప్రస్తావించడంతో ఆమెపై కోర్టు ధిక్కరణ కేసులు నమోదు అయ్యాయి. ఈ క్రమంలో తనపై విధించిన కేసులపై స్టే ఇవ్వాలని షర్మిల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. షర్మిలపై నమోదైన కోర్టు ధిక్కరణ కేసుతో పాటు వివేకా హత్య కేసు గురించి ప్రస్తావించ వద్దు అంటూ కడప జిల్లా కోర్టు జారీ చేసిన ఆదేశాలపైన సుప్రీంకోర్టు స్టే విధించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version