ఈ వ్యాపారంతో నెలకు లక్ష ఆదాయం..! పెట్టుబడి సాయం కూడా..!!

-

జాబ్‌ వద్దు ఏదైనా వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారా.. కొంచెం డబ్బు ఉంది.. దీన్ని ఎక్కడ పెట్టుబడి పెడితే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారా.. అయితే మీకోసమే ఈ ఆర్టికల్‌. మీరు టిష్యూ పేపర్ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. అన్ని సీజన్లలోవీటికి డిమాండ్ ఉంటుంది. టిష్యూ పేపరా అని చీప్‌గా చూడకండి.. క్లిక్‌ అయితే లాభాల వర్షమే.. ఎప్పుడైనా దీనిని ప్రారంభించవచ్చు. పెట్టుబడికి డబ్బులు ఎక్కువగా లేకుంటే.. ప్రభుత్వం లోన్స్ కూడా ఇస్తుంది. టిష్యూ పేపర్ యూనిట్ ద్వారా భారీ మొత్తంలో మీకు లాభాలు వచ్చే అవకాశముంది.
ప్రస్తుతం టిష్యూ పేపర్ వాడకం బాగా పెరిగింది. సాధారణంగా చేతులు, నోటిని శుభ్రం చేయడానికి టిష్యూ పేపర్‌ని ఉపయోగిస్తారు. ఈ రోజుల్లో రెస్టారెంట్, హోటల్, ధాబా, ఆఫీసు, హాస్పిటల్ ఇలా దాదాపు అన్ని చోట్లా టిష్యూ పేపర్‌ను కచ్చితంగా వాడుతున్నారు. అందుకే వీటికి ఏ సీజన్‌లో అయినా డిమాండ్‌ ఉంటుంది. మీరు నేరుగా హోటల్స్, హాస్పిటల్స్, ఆఫీసులతో మాట్లాడి.. టిష్యూ పేపర్ సరఫరా చేయవచ్చు. లేదంటే సూపర్ మార్కెట్‌ ద్వారా కూడా అమ్ముకోవచ్చు. ఆన్‌లైన్ వేదికగా విక్రయాలు జరపవవచ్చు. మార్కెటింగ్ కోసం ఆరంభంలో కొంత స్టడీ చేస్తే.. ఆ తర్వాత బాగా ఆదాయం వస్తుంది.

పెట్టుబడి ఎంత ఉండాలి..?

టిష్యూ పేపర్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలంటే దాదాపు రూ.3.50 లక్షలు వరకు మీ వద్ద ఉండాలి. ఇంత డబ్బు మీ దగ్గర లేకుంటే.. ఏదైనా బ్యాంకులో ముద్ర పథకం కింద రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మీ వద్ద ఇప్పటికే రూ. 3.50 లక్షలు ఉంటే….. బ్యాంకు నుంచి దాదాపు రూ. 3.10 లక్షల టర్మ్ లోన్, రూ. 5.30 లక్షల వరకు వర్కింగ్ క్యాపిటల్ లోన్‌గా పొందువచ్చు. యంత్రాలతో ఏటా 1.50 లక్షల కిలోల పేపర్ నాప్‌కిన్‌లను ఉత్పత్తి చేయవచ్చు. కిలో టిష్యూ పేపర్‌ని రూ.65 చొప్పున మార్కెట్‌లో విక్రయించవచ్చు. ఈ లెక్కన ఏడాదిలో దాదాపు రూ.97.50 లక్షల టర్నోవర్ చేయవచ్చు. ఇందులో ఖర్చులన్నీ తీసేస్తే.. ఏటా దాదాపు 10-12 లక్షల రూపాయలు వరకూ ఆదా చేసుకోవచ్చు.

రుణం కోసం ఏం చేయాలంటే..

టిష్యూ పేపర్ యూనిట్‌కు రుణం కోసం మీరు ప్రధాన మంత్రి ముద్రా యోజన కింద ఏదైనా బ్యాంకులో రుణం తీసుకోవచ్చు..ఇందుకోసం మీరు ఫామ్ నింపాల్సి ఉంటుంది. అందులో అన్ని వివరాలు నమోదు చేయాలి. పేరు, చిరునామా, వ్యాపార చిరునామా, విద్య , ప్రస్తుత ఆదాయం, ఎంత రుణం అవసరం వంటి వివరాలను ఇవ్వాలి. దీనికి ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు లేదా గ్యారెంటీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోండి.. రుణ మొత్తాన్ని సులభమైన వాయిదాలలో తిరిగి చెల్లించవచ్చు. వ్యాపారం బాగా జరిగితే.. కొన్ని నెలల్లోనే మీ అప్పు మొత్తం తీరుతుంది. ఆ తర్వాత నుంచి భారీగా ఆదాయం పొందవచ్చు. ఆరంభంలో కాస్త కష్టపడితే పనిచేస్తే.. మీకు నెలకు లక్ష రూపాయల వరకు ఆదాయం మీ సొంతం..
అయితే.. ఇవి చెప్పుకున్నంత సులభంగా అయిపోదు. మీరు ఉన్న ఏరియాను బట్టి ఎంత వరకూ ఇది క్లిక్‌ అవుతుంది. చేయగలమా లేదని నిపుణుల సలహా తీసుకుని ఇంకా రీసర్చ్‌ చేసి స్టెప్‌ తీసుకోవచ్చు. మేం కేవలం ఒక ఐడియా మాత్రమే ఇచ్చాం!

Read more RELATED
Recommended to you

Exit mobile version