కరోనా వైరస్ దెబ్బకు ఎవరూ కూడా బంగారం కొనుగోలు చేసే పరిస్థితి ఎక్కడా కనపడటం లేదు. అయినా సరే బంగారం ధరలు మాత్రం పెరుగు దల ఆగడం లేదు. రోజు రోజుకి బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్ లో 22 క్యారెట్లు పది గ్రాములకు గాను 140 రూపాయలు పెరగడంతో 42,100 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం ధర 210 రూపాయల పెరగడం తో 45,970 రూపాయలకు చేరుకుంది.
విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్లు పది గ్రాములకు 140 రూపాయలకు పెరగడం తో 42,100 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం 210 రూపాయల పెరగడం తో 45,970 రూపాయలకు చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే ఇక్కడ కూడా బంగారం ధరలు పెరిగాయి.
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 190 రూపాయలకు పెరిగింది. దీనితో 46,100 రూపాయలకు చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 210 రూపాయలకు చేరుకుంది. 43,860 రూపాయలకు చేరింది. వెండి ధరల విషయానికి వస్తే కేజీ వెండి ధర 42 వేల మార్కుకు చేరుకుంది. 41,890 రూపాయలకు కేజీ వెండి చేరుకుంది.