దేశంలో థర్డ్ వేవ్ ముప్పు.. పెరుగుతున్న ఆర్ ఫ్యాక్టర్

-

కరోనా రక్కసి రాక్షస నాట్యం కొనసాగిస్తూనే ఉంది. ఎంతో మందికి తమ ప్రియమైన వారిని దూరం చేసిన కోవిడ్ మహమ్మారి, ఇంకా దాని వ్యాప్తిని పెంచుతూనే ఉంది. ప్రస్తుతానికి రెండవ వేవ్ తగ్గిందని అనుకుంటున్నప్పటికీ మూడవ వేవ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఐతే ప్రస్తుతం కరోనా కేసుల్లో ఆర్ ఫ్యాక్టర్ సంఖ్య పెరుగుతుంది. 1.20కి చేరువలో ఆర్ ఫ్యాక్టర్ సంఖ్య ఉంది.

ఈ ఆర్ ఫ్యాక్టర్ అనేది కోవిడ్ ఎంత రేటుతో వ్యాప్తి చెందుతుందనేది తెలియజేస్తుంది. కేంద్ర ప్రభుత్వం థర్డ్ వేవ్ గురించి హెచ్చరించినపుడు ఈ థర్డ్ వేవ్ 1.03గా ఉండిండి. ప్రస్తుతం రోజు రోజుకీ పెరుగుతుంది. కేరళ, మిజోరాం, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుండడంతో ఈ ఆర్ ఫ్యాక్టర్ పెరుగుతుంది. దీంతో ప్రజల్లో ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఏదేమైనా కోవిడ్ నిబంధనలు పాటించి, ఆరోగ్యకరమైన అలవాట్లు అలవర్చుకోవాలని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version