వరల్డ్ కప్ ముగిసిన అనంతరం ఇండియా ఆడుతున్న మొదటి సిరీస్ ఫైనల్ ప్రత్యర్థి ఆస్ట్రేలియా తోనే కావడం విశేషం. మొత్తం అయిదు మ్యాచ్ ల టీ 20 సిరీస్ లో ఈ రోజు మొదటి మ్యాచ్ ను ఇండియా వైజాగ్ లోని వైఎస్సార్ స్టేడియం లో ఆడుతోంది. వరల్డ్ కప్ లో ఆడిన ఇండియా సీనియర్ ఆటగాళ్లు అందరూ రెస్ట్ తీసుకోవడంతో, సూర్య కుమార్ యాదవ్ కు ఇండియా టీం యాజమాన్యం కెప్టెన్ గా బాధ్యతలను అప్పగించింది. అందుకే సూర్య కు ఇది చాలా ప్రత్యేకమైన మ్యాచ్ అని చెప్పాలి. కాగా ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన సూర్య కుమార్ యాదవ్ బౌలింగ్ ఎంచుకుని ఛేజింగ్ కు మొగ్గు చూపాడు. జట్టులో ఛేజింగ్ చేయడానికి నిండా స్టార్లు ఉండడం గమనార్హం.
ముఖ్యంగా గైక్వాడ్, జైస్వాల్, కిషాన్, సూర్య, తిలక్ వర్మ మరియు రింకు సింగ్ లాంటి హీటర్లు ఉండడంతో ఆస్ట్రేలియా ఎంత స్కోర్ చేసినా యువకులతో కూడిన ఇండియా జట్టు మొదటి ఛాలెంజ్ లో గెలిచి తీరుతుందన్న నమ్మకం ఉంది.