IND VS AUS: ఆస్ట్రేలియాతో ఇండియా ఐదు టెస్టుల సిరీస్

-

32 సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియాతో ఎంతో ప్రతిష్ఠాత్మక సిరీస్‌ బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీ జరగనుంది.ఐదు టెస్టుల సిరీస్‌ లో భాగంగా ఏడాది చివర్లో జరగనున్న ఈ సిరీస్ లో మార్పు చోటుచేసుకుంది.ఇప్పటివరకూ ఎక్కువగా నాలుగు టెస్టుల సిరీస్‌గా దీన్ని నిర్వహించారు. ఇలా రెండు జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌ నిర్వహించడం 32 సంవత్సరాల తర్వాత ఇదే తొలిసారి. ”1991-92 తర్వాత తొలిసారి ఇండియా-ఆస్ట్రేలియా ఐదు టెస్టుల సిరీస్‌లో తలపడనున్నాయి.

ఈ ట్రోఫీ షెడ్యూల్‌ను త్వరలోనే విడుదల చేస్తాం’ అని క్రికెట్‌ ఆస్ట్రేలియా, బీసీసీఐ సంయుక్తగా ఎక్స్(ట్విట్టర్) లో పోస్టు చేశాయి.ఈ ఏడాది నవంబర్‌లో పెర్త్‌లో తొలి టెస్టు జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత రెండు మ్యాచ్‌లకు ఆడిలైడ్‌, బ్రిస్బేన్‌లు వేదికలు కానున్నట్లు తెలుస్తోంది. బాక్సింగ్‌ డే టెస్టు మెల్‌బోర్న్‌ వేదికగా.. చివరి టెస్టు సిడ్నీలో జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన గత 4 సిరీస్‌ల్లో భారత్ వరుసగా విజేతగా నిలిచింది. ఇందులో 2 సిరీస్‌ల్లో ఆసీస్‌ను వారి సొంత గడ్డపైనే ఓడించడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version