నేడు ఆస్ట్రేలియాతో భారత్‌ సెమీస్‌ పోరు

-

IND vs AUS semi final, Champions Trophy 2025:  నేడు ఆస్ట్రేలియాతో భారత్‌ సెమీస్‌ పోరు జరుగనుంది. దుబాయ్ వేదికగా మధ్యాహ్నం 2:30 గంటల నుంచి ఆస్ట్రేలియాతో భారత్‌ సెమీస్‌ పోరు ఆరంభం కానుంది. వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్ ఓటమికి నేడు రివేంజ్ తీర్చుకోవాలని కోరుకుంటున్నారు టీమిండియా ఫాన్స్. ఇక ఈ ఆస్ట్రేలియాతో భారత్‌ సెమీస్‌ పోరులో టాస్‌ గెలిచిన జట్టు బ్యాటింగ్‌ తీసుకునే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి.

IND vs AUS semi final, Champions Trophy 2025

మరికొన్ని గంటల్లో ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్ లో ఆస్ట్రేలియాతో భారత్ పోరు జరగనుంది. ఈ నేపథ్యంలో గతం ఫ్యాన్స్ ను వెంటాడుతోంది. ఏడాదిన్నర కిందట వన్డే ప్రపంచకప్‌ను రోహిత్‌సేన చేజిక్కించుకోవడం ఖాయం అనుకున్న దశలో.. ఫైనల్లో కంగారూలు కొట్టిన దెబ్బను భారత అభిమానులు అంత సులువుగా మరిచిపోలేరు. ఇప్పుడు ఆ ఓటమికి బదులు తీర్చుకోవాలన్నది అందరి ఆశ. కంగారులను ఓడిస్తే గత ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నట్లే.

Read more RELATED
Recommended to you

Latest news