IND VS RSA 2ND TEST : టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇండియా.. కోహ్లీ దూరం

-

ఇండియా, సౌతాఫ్రికా జట్ల మధ్య ఇవాళ రెండో టెస్ట్‌ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్‌ జోహన్నెస్‌బర్గ్ లోని… ది వాండరర్స్ స్టేడియంలో జరుగుతుంది. ఇక కాసేపటి క్రితమే.. ఈ మ్యాచ్‌ కు సంబంధించిన టాస్‌ ప్రక్రియ ముగిసింది. ఇందులో టాస్‌ గెలిచిన టీమిండియా కెప్టెన్‌ కేఎల్ రాహుల్… మొదట బ్యాటింగ్‌ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో మొదట బౌలింగ్‌ చేయనుంది సౌతాఫ్రికా జట్టు. మొదటి మ్యాచ్‌ విజయంతో.. ఈ మ్యాచ్‌ లో ఎలాగైనా గెలవాలని ఇండియా ఉత్సాహంగా ఉంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే…

దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): డీన్ ఎల్గర్ (సి), ఐడెన్ మార్క్‌రామ్, కీగన్ పీటర్‌సన్, రాస్సీ వాన్ డెర్ డుస్సెన్, టెంబా బావుమా, కైల్ వెర్రెయిన్నే (w), మార్కో జాన్సెన్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, డువాన్ ఒలివియర్, లుంగి ఎన్‌గిడి

భారత్ (ప్లేయింగ్ XI): కేఎల్ రాహుల్(సి), మయాంక్ అగర్వాల్, ఛెతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, హనుమ విహారి, రిషబ్ పంత్(w), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version