IND vs SL : టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న భార‌త్.. ఇరు తుది జ‌ట్లు ఇవే

-

శ్రీ‌లంకతో జ‌రుగుతున్న టీ 20 సిరీస్ ను సొంతం చేసుకోవ‌డానికి భార‌త్ సిద్ధం అవుతుంది. నేడు శ్రీ‌లంక‌, భార‌త్ మ‌ధ్య రెండో టీ 20 మ్యాచ్ ధ‌ర్మ‌శాల వేదిక‌గా జ‌రుగుతుంది. కాగ ఈ మ్యాచ్ లో రోహిత్ సేన టాస్ నెగ్గింది. దీంతో మొద‌ట బౌలింగ్ చేయాల‌ని కెప్టెన్ రోహిత్ శ‌ర్మ నిర్ణ‌యం తీసుకున్నాడు. దీంతో శ్రీ‌లంక మొద‌ట బ్యాటింగ్ చేయ‌నుంది. కాగ ఈ మ్యాచ్ ను గెలిచి.. సిరీస్ ను సొంతం చేసుకోవాల‌ని భార‌త్ ప్ర‌ణాళిక‌ల‌ను సిద్ధం చేస్తుంది.

అలాగే ఈ మ్యాచ్ అయినా.. గెలిచి సిరీస్ పోటీలో ఉండాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది. కాగ ఈ మ్యాచ్ కు భార‌త్.. జ‌ట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బ‌రిలోకి దిగుతుంది. శ్రీ‌లంక‌.. రెండు మార్పుల‌తో బ‌రిలోకి దిగుతుంది. కాగ రెండు తుది జ‌ట్లు ఇలా ఉన్నాయి.

భారత్ తుది జ‌ట్టు : రోహిత్ శర్మ( కెప్టెన్ ), ఇషాన్ కిషన్( వికెట్ కీప‌ర్ ), శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్, రవీంద్ర జడేజా, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్

శ్రీలంక తుది జ‌ట్టు : పాతుమ్ నిస్సాంక, కమిల్ మిషార, చరిత్ అసలంక, దనుష్క గుణతిలక, దినేష్ చండిమాల్( వికెట్ కీప‌ర్ ), దసున్ షనక( కెప్టెన్ ), చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, ప్రవీణ్ జయవిక్రమ, బినుర ఫెర్నాండో, లహిరు కుమార

Read more RELATED
Recommended to you

Exit mobile version