టీమిండియా వరుస విజయాలతో జోరు మీద ఉంది. ఇప్పటికే విండీస్ తో జరిగిన టీ 20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన రోహిత్ సేన.. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న మూడో టీ 20 సిరీస్ పై కన్ను వేసింది. నేడు జరగబోయే రెండో టీ 20 మ్యాచ్ లో విజయం సాధించి.. సిరీస్ ను ఖాయం చేసుకోవడానికి రోహిత్ సేన ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే టీమిండియా.. వరుసగా 10 టీ 20 మ్యాచ్ లలో విజయం సాధించింది.
నేటి మ్యాచ్ లో కూడా విజయం సాధించి వరుసగా 11 మ్యాచ్ ల్లో గెలిచిన జట్టుగా రికార్డు సృష్టించడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది. మొదటి మ్యాచ్ లో ఇషాన్ కిషన్.. అద్భుతమైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. కాగ ఈ మ్యాచ్ కు రుతురాజ్ గైక్వాడ్ ఫిటి నెస్ సాధించి.. అందుబాటులో ఉండే అవకాశం ఉంది. దీంతో ఓపెనర్లు ఇషాన్ కిషన్ తో పాటు రుతురాజ్ గైక్వాడ్ ఆడే సూచనలు ఉన్నాయి. అలాగే రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యార్ తర్వాతి స్థానంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. బౌలింగ్ లోనూ టిమిండియా పటిష్టంగా ఉంది.
గత మ్యాచ్ ల భువనేశ్వర్ ప్రదర్శన అబ్బుర పరిచింది. అతనికి తోడుగా బూమ్రా, ఆవేశ్ ఖాన్, సిరాజ్ తో పాటు స్పిన్ విభాగంలో రవి బిష్ణోయ్ బలంగా ఉన్నాడు. కాగ నేటి మ్యాచ్ ధర్మ శాల వేదికగా.. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు ప్రారంభం అవుతుంది.