కొందరు వ్యక్తులు మహిళలు, యువతులు, చిన్నారులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇటువంటి కల్చర్ ఇటివలీ కాలంలో బాగా పెరిగింది. రోడ్డు మీద వెళ్లేటప్పుడు, జనాల మధ్య, బస్సుల్లో, మెట్రో సర్వీసుల్లో, బస్ స్టాపుల వద్ద కొందరు కామాంధులు, ఆకతాయిలు ఆడవాళ్లను అసభ్యంగా తాకుతూ తిరుగుతున్నారు. వీరిపై షీ టీం నిఘా వేసి ఉంచుతున్నారు. అయినప్పటికీ కొందరి బుద్ధం మారడం లేదు.
ఈ క్రమంలోనే నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలో ఇడ్లీ బండి నిర్వహిస్తున్న ఝాన్సీ రాణి అనే యువతి పట్ల ఓ ముస్లిం వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఆ యువతి అతన్ని నిలదీయడంతో పాటు ఎదురుదాడి చేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. తనను అసభ్యంగా తాకిన వ్యక్తిని యువతి దేహశుద్ధి చేయడంపై నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
యువతి పట్ల అసభ్య ప్రవర్తన.. దేహశుద్ధి చేసిన యువతి
నల్లగొండ – కొండమల్లేపల్లి మండల కేంద్రంలో ఇడ్లీ బండి నిర్వహిస్తున్న ఝాన్సీ రాణి అనే యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తి.
అతన్ని చితకబాది దేహశుద్ధి చేసిన యువతి pic.twitter.com/H9LpFoMBO6
— Telugu Scribe (@TeluguScribe) January 5, 2025