ఒక పని మీద మనసు ఉండట్లేదా..? మెదడును పదును చేసే ఈ వ్యాయామాలు చేయండి

-

కాన్సన్ట్రేషన్ సరిగ్గా కుదరక ఇబ్బంది పడుతుంటే మెదడుకు పనిచెప్పే కొన్ని పనులు చేస్తుండాలి. లేదంటే మెదడు మొద్దుబారిపోయి.. మీరు ఎంత ప్రయత్నం చేసినా కాన్సన్ట్రేషన్ కుదరదు. ఒకరోజులో కొంత సమయం పాటు మెదడుకు పని చెప్పే పనులు చేయాలి.

లెక్కలు:

మనసులో ఒక అంకె అనుకుని, దానికి మరో సంఖ్యను కలిపి ఫలితం ఎంత వచ్చిందో లెక్క కట్టండి. ఇప్పుడు ఆ ఫలితానికి ఇంకో సంఖ్యను జోడించడం లేదా దానిలోంచి కొంత తీసివేయడం చేయాలి. ఇది మెదడుకు మంచి వ్యాయామం లాంటిది.

ఏబీసీడీల ఆట:

జంతువుల పేర్లు గానీ, నగరాల పేర్లు గానీ ఏ నుండి జెడ్ వరకు ఒక్కోదాన్ని మనసులో అనుకోండి. దీనివల్ల మీ జ్ఞాపకశక్తి చాలా పెరుగుతుంది. సోషల్ మీడియాలో రీల్స్ చూస్తూ సమయం వృధా చేయడం కన్నా ఇది మంచిది.

ఊహించండి:

ఊహలు కూడా మెదడును చురుకుగా చేస్తాయి. ఒక ప్రదేశాన్ని ఊహించండి. అందులో మీరు ఏమేం ఉంచాలనుకుంటున్నారో, దాని రంగు ఏమిటో, అది ఎంత సైజులో ఉండాలో ఊహించండి. ఊహలతో కొత్త ప్రపంచాన్ని సృష్టించండి. దీనివల్ల క్రియేటివిటీ పెరుగుతుంది.

పదాలతో ఆటలు:

పదాలతో ఆటలాడటం అంటే.. మీకు నచ్చిన పదాన్ని తీసుకోండి. ఆ పదం దేనికి సంబంధించినదో కనుక్కోండి. ఉదాహరణకు పెన్సిల్ అనే పదం తీసుకుంటే.. దానికి తరగతి గదికి సంబంధం ఉంటుంది. ఇలా గొళుసు మాదిరిగా పోతే బాగుంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version