పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలంటే.. ఈ ఆహార పదార్థాలను తీసుకోవాల్సిందే..!

-

శరీరంలో ప్రతి అవయవం ఆరోగ్యంగా ఉంటేనే పూర్తి ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యంగా శరీరంలో పేగు ఆరోగ్యం ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. పేగులో ఎన్నో లక్షల సూక్ష్మజీవులు ఉంటాయి. ఎప్పుడైతే వీటి పనితీరు బాగుంటుందో, జీర్ణక్రియ, పోషకాల శోషణ మెరుగ్గా ఉంటాయి. అంతేకాకుండా మానసిక ఆరోగ్యం కూడా దీని పై ఆధారపడి ఉంటుంది. కనుక ఈ సూక్ష్మజీవుల మధ్య ఎంతో ఆరోగ్యకరమైన సంబంధం ఉండాలి. అయితే దానికోసం కొన్ని రకాల ఆహార పదార్థాలను చేర్చుకోవాలి. ఇలా చెయ్యడం వలన చెడు బ్యాక్టీరియాకు సంబంధించిన సమతుల్యం సరైన విధంగా ఉంటుంది. మీ డైట్‌లో భాగంగా ఈ సూపర్ ఫుడ్స్‌ను చేర్చుకోవడం వలన ఆహారంలోని మైక్రోబయోమ్ ను తిరిగి నింపుతాయి. కనుక వీటిని కచ్చితంగా తీసుకోవాల్సిందే.

పేగు ఆరోగ్యానికి పెరుగు ఎంతో సహాయం చేస్తుంది అని చెప్పవచ్చు. పెరుగుని మజ్జిగగా తీసుకోవచ్చు లేక పండ్లతో పాటుగా తినవచ్చు. పెరుగును తీసుకోవడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాకుండా ప్రోబయోటిక్స్ కూడా పుష్కలంగా అందుతాయి. ముఖ్యంగా ఉబ్బరం వంటి జీర్ణ ప్రక్రియకు సంబంధించిన సమస్యలు తగ్గిపోతాయి. కనుక ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత ఒక గ్లాస్ మజ్జిగ తీసుకోవడం వలన చాలా ఉపయోగం ఉంటుంది మరియు పేగు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

జీర్ణవ్యవస్థకు ఉసిరి ఎంతో సహాయం చేస్తుంది. దీనిలో ఫైబర్, విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయం చేస్తుంది. చాలా శాతం మంది నెయ్యిని తీసుకుంటే బరువు పెరిగిపోతారని అనుకుంటారు. కానీ ప్రతిరోజు తక్కువ మోతాదులో నెయ్యిను తీసుకోవడం వలన జీర్ణక్రియకు ఎంతో సహాయం చేస్తుంది. పైగా పేగుల ఆరోగ్యానికి ప్రతిరోజు ఒక చెంచా నెయ్యి తీసుకోవడం ఎంతో అవసరం.
పేగుల ఆరోగ్యానికి పెసరపప్పు ఎంతో మేలు చేస్తుంది. పైగా ఇది ఎంతో త్వరగా జీర్ణం అవుతుంది. కనుక మీ ఆహారంలో భాగంగా ఈ ఆహార పదార్థాలను కచ్చితంగా తీసుకోండి. ఇలా చేయడం వలన పూర్తి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news