కేబీఆర్‌ పార్కు దగ్గ‌ర దొంగ‌ల క‌ల‌క‌లం… కొబ్బరి బొండాలే టార్గెట్‌

-

కేబీఆర్‌ పార్కు దగ్గ‌ర దొంగ‌ల క‌ల‌క‌లం… కొబ్బరి బొండాలే టార్గెట్ గా చేసుకుని… దొంగ‌లు హ‌ల్ చ‌ల్ చేశారు. ఆటోలో వచ్చి.. కొబ్బరి బొండాలు ఎత్తుకెళ్లారు. హైదరాబాద్-బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.14లో కేబీఆర్‌ పార్కుకు సమీపంలోని ఖాళీ స్థలంలో కొబ్బరి బొండాలు, పండ్ల విక్రయాలు చేస్తార‌న్న సంగ‌తి తెలిసిందే.

An auto driver stole coconut shells at kbr park
An auto driver stole coconut shells at kbr park

వ్యాపారం ముగిశాక రాత్రిపూట వాటి చుట్టూ కవర్లు కప్పేసి వ్యాపారులు అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. త‌రచూ వ్యాపార‌స్తులు అలాగే… చేస్తూ ఉంటారు. అయితే… ఇదే అదునుగా భావించి.. అర్థరాత్రి దాటిన తర్వాత అక్కడకు వచ్చి కొబ్బరి బొండాలను దొంగిలించాడు ఓ ఆటోడ్రైవర్‌.

అక్కడి సీసీ ఫుటేజీని పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వ‌చ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో రంగంలోకి దిగి నిందితుడి కోసం గాలిస్తున్నారు బంజారాహిల్స్‌ పోలీసులు. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు వైర‌ల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news