ఇండియా కూటమిపై బాలీవుడ్ ముద్దుగుమ్మ, మండి బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమిది ఫ్యామిలీ ఫస్ట్ నినాదమని విమర్శించారు.హిమాచల్ ప్రదేశ్ లోని మండి లోక్ సభ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడుతూ… ఇండియా కూటమికి తనపై పోటీ చేయడానికి అభ్యర్థి దొరకడం లేదని ఎద్దేవ చేశారు.
ప్రజా సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని కంగనా రనౌత్ తెలిపారు.రాజకీయాల్లో కొత్తవారికి అవకాశం ఇవ్వాలని రాజకీయ పార్టీలకు సూచించారు. సినీ పరిశ్రమలోనూ ఫ్యామిలీ పాలిటిక్స్ చూశానని సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇక సినిమాల విషయానికొస్తే.. ఆమె కీలక పాత్రలో నటించిన ‘ఎమర్జెన్సీ’ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ ఏడాది జూన్లో ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఇందులో ఆమె మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో నటిస్తున్నారు. దీనితో పాటు ‘తను వెడ్స్ మను పార్ట్ 3’ లో నటిస్తున్నారు.