భారత్ నయా రికార్డ్.. ఆ లిస్టులో నాలుగో ర్యాంక్..!

-

భారత్ మరో అద్భుతమైన విజయాన్ని సాధించింది. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్-2020 జాబితాలో భారత్ స్థానం మరింత మెరుగైంది. తాజా ర్యాంకింగ్స్ లో 131 దేశాలలో భారత్ 48వ స్థానంలో నిలిచింది. గతేడాది ర్యాంకింగ్స్ తో పోల్చితే భారత్ నాలుగు స్థానాలు పైకి చేరింది. అంతేకాదు అత్యధిక ఆవిష్కరణలు సాధించిన మధ్యస్థ అల్పాదాయ దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో నిలిచింది. ఇక గ్లోబల్ ఇన్నోవేషన్ అంశంలో స్విట్జర్లాండ్ అగ్రస్థానంలో ఉంది.

ఆ తర్వాత స్థానాల్లో స్వీడన్, అమెరికా, బ్రిటన్, నెదర్లాండ్స్ ఉన్నాయి. కాగా, ఇప్పటికే భారతదేశం ప్రపంచ స్థాయి ఆటబొమ్మల ఉత్పత్తి కేంద్రంగా మారేందుకు కృషి చేయాలని మోడీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దేశంలోని గొప్ప వారసత్వం , సంప్రదాయాల ద్వారా బొమ్మలు, గేమింగ్ ఇండస్ట్రీలో ఎన్నో ఆవిష్కరణలు చేయొచ్చన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version