2 నెలల తర్వాత మళ్ళీ కలిసిన ఇండియా కెనడా !

-

దాదాపు 2 నెలలకు ముందు ఇండియా మరియు కెనడా ల మధ్యన జరిగిన వివాదం వలన రెండు దేశాల మధ్యన రాకపోకలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ను దారుణంగా హత్య చేసిన ఘటనలో ఇండియా కు సంబంధం ఉందన్న విషయంలో అప్పట్లో కెనడా ప్రధాని ట్రూడో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దానితో రెండు దేశాల మధ్యన ఈ వీసా సేవలను నిలిపివేసింది ఇండియా ప్రభుత్వం. కాగా ఈ రెండు నెలల కాలం తర్వాత మళ్ళీ అనుబంధాలు కాస్త మెరుగవడంతో ఒక మంచి నిర్ణయానికి ఇండియా వచ్చింది. ఇంతకు ముందు లాగే ఇప్పుడు ఇండియా కెనడా దేశాల మధ్యన ఈ వీసా సేవలను పునరుద్దరించినట్లు తెలుస్తోంది.

ఇక మీదట ఇండియా నుండి కెనడాకు భారతీయులు వెళ్ళడానికి అవకాశాన్ని కల్పించారు. ఈ విషయంలో చొరవ చూపిన ప్రధాని నరేంద్ర మోదీ మరియు ట్రూడో లకు రెండు దేశాల ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version