మీ ఆధార్ తీసుకుని 10 ఏళ్ళు అయిందా ??

-

ఇండియాలో జీవించే ప్రతి ఒక్కరికీ ఒక గుర్తింపు ఉండాలన్న ఉద్దేశ్యంతో భారత్ ప్రభుత్వం ఆధార్ ను అమలులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఆధార్ ను వ్యక్తి వయసును బట్టి అప్డేట్ చేసుకునే అవసరం ఉంది. అందులో భాగంగానే పెద్దవారు తమ ఆధార్ ను తీసుకుని పది సంవత్సరాలు కనుక పూర్తి అయ్యి ఉంటే మళ్ళీ ఆధార్ ను అప్డేట్ చేసుకోవాలని ప్రభుత్వం గత కొన్ని రోజులుగా చెబుతూ వస్తోంది. ఈ గడువు డిసెంబర్ 14 వరకు ఉండనుంది అన్న విషయాన్ని ప్రభుత్వం ఇప్పటికే తెలియచేసింది. కానీ ఈ గడువు తర్వాత ఆధార్ ను అప్డేట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా అందుకు తగిన ఛార్జ్ ను చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.

మీకు ఏ విధంగా చేసుకోవాలో తెలియకపోతే దగ్గర్లోని ఆధార్ కేంద్రాలలోనుకానీ, లేదా మీ సేవ సెంటర్స్ లో కానీ అడిగి తెలుసుకుని తగిన పత్రాలను సమర్పించి ప్రక్రియను పూర్తి చేసుకోవలెను. సిస్టం బాగా ఐడియా ఉన్న వారు అయితే మీరే సైట్ లోకి వెళ్లి అప్డేట్ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version