కారు కొనుక్కుందామని ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారా… కొత్త సంవత్సరం కొత్త కారులో షికారు చేయాలని అనుకుంటున్నారా.. అయితే మీ నెంబర్ 7 లక్షల మంది తర్వాతే రావచ్చు. అవును ఇండియాలో కొత్త కార్ల కోసం వెయిటింగ్ లిస్ట్ లో 7 లక్షల మంది ఉన్నారు. ఇప్పడు కార్ బుక్ చేసుకుంటే.. 7 నుంచి 9 నెలల తర్వాతే కారు డెలవరీ అయ్యే అవకాశం ఉంది.
ప్రపంచ వ్యాప్తంగా సెమికండక్టర్ల చిప్స్ తయారీలో తీవ్ర కొరత ఉండటంతో కార్ల తయారీ కూడా లేటవుతోంది. వివిధ కంపెనీల కార్ల వెయిటింగ్ లిస్ట్ పరిశీలిస్తే మారుతి సుజుకి 2.5 లక్షలు, హ్యుందాయ్ 1 లక్ష, టాటా మోటార్స్ 1 లక్ష, కియా 75000 కార్ల కోసం ఆర్డర్లు ఉన్నాయి. అయితే డిమాండ్ కు సరిపడా సప్లయ్ లేదు. కారు రావాలంటే చాలా నెలలు పడుతోంది.
ఇదిలా ఉంటే ఇండియాలో కొత్త కార్ల సంక్షోభం కారణంగా పాత కార్ల మార్కెట్ చాలా పెరిగింది. దాదాపు ఒకటిన్నర రెట్లు యూజుడ్ కార్ల మార్కెట్ పెరిగిందట.