ఇండియాలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా 47,092

-

మన దేశంలో కరోనా మహమ్మారి కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన ఈ ఈ కరోనా కేసులు… విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం… గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా… 47, 092 కరోనా కేసులు నమోదు కాగా… 509 మంది కరోనాతో మృతి చెందారు.

దీంతో దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కేసుల సంఖ్య 3,28,57, 937 కు చేరుకోగా మొత్తం కరోనా మరణాల సంఖ్య 4, 39, 529 కి చేరింది. ఇక ప్రస్తుతం దేశంలో మొత్తం 3,89,583 యాక్టివ్ కేసులు ఉండగా.. మొత్తం 3,20,28,825 మంది బాధితులు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు.

ఇక గడచిన 24 గంటల్లో 35 వేల 181 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 81,09,244 మంది కి కరోనా వ్యాక్సిన్ ఇచ్చింది భారత ఆరోగ్య శాఖ. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారు సంఖ్య 66,30,37,334 కు చేరింది. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండటం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version