భారత్‌లో కొత్తగా 13,086 కేసులు..

-

యావత్తు ప్రంపచాన్ని భయాందోళకు గురి చేస్తున్న కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. అయితే.. దేశంలో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,086 కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. నిన్నటితో పోలిస్తే 18శాతం తక్కువ కేసులు నమోదయ్యాయి. నిన్న 16వేలకుపైగా కేసులు
వెలుగు చూశాయి. తాజాగా 12,456 మంది బాధితులు కోలుకోగా.. మరో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 1.14లక్షల మార్క్‌ను దాటింది.

తాజా కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,35,31,650కు చేరింది. ఇందులో 4,28,91,933 మంది కోలుకోగా.. 5.25లక్షలకుపైగా మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 1,14,475 యాక్టివ్‌ కేసులు కేసులున్నాయి. ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 2.90శాతంగా ఉందని ఆరోగ్యశాఖ పేర్కొంది. 24గంటల్లో 4,51,312 పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటి వరకు 86.44కోట్ల పరీక్షలు నిర్వహించినట్లు చెప్పింది. టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు 198.09 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు వివరించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version