భారత్ లో కరోనా విజృంభణ నెమ్మదిగా తగ్గుతోందని భావిస్తూ వచ్చాం. కొన్ని రోజుల పాటు కేసులు మరణాలు రెండూ తక్కువ నమోదు కావడంతో ఇక కరోనా ఎఫెక్ట్ తగ్గినట్టేనని భావించారు. కానీ మళ్ళీ నెమ్మదిగా కేసులు, మరణాలు కూడా పెరుగుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం గడచిన 24 గంటలలో 50,210 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలానే గడచిన 24 గంటలలో దేశంలో కరోనా వల్ల మొత్తం 704 మంది మృతి చెందారు.
అలానే గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 55,331గా ఉంది. దేశంలో ఇప్పటి వరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 83,64,086 కాగా అందులో ఇప్పుడు దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 5,27,962గా ఉన్నాయి. ఇప్పటి దాకా కరోనాకు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 77,11,809కి చేరింది. అలానే కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 1,24,315కి చేరింది.