కరోనా వైరస్ అమెరికాలో ఎంటర్ అయినా టైం లో మరణాలు భయంకరంగా సంభవిస్తున్న సమయములో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇండియా ని హైడ్రోక్సీక్లోరోక్విన్ అనే డ్రగ్ పంపించాలని వేడుకోవడం మనకందరికీ తెలిసినదే. అడిగిన సందర్భం లో ట్రంప్ వార్నింగ్ ఇచ్చినట్లు మాట్లాడిన ఆ తర్వాత కొద్దిగా వెనక్కి తగ్గి మోడీని వెంటనే పంపించాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా హైడ్రోక్సీక్లోరోక్విన్ కరోనా వైరస్ కట్టడి చేయడంలో గేమ్ చేంజర్ ట్రంప్ అభివర్ణించడం జరిగింది. ఈ మెడిసిన్ తో పాటు అజిత్రోమైసిన్ అనే యాంటీబయోటిక్ కలిపి వాడుతుంటే కరోనా వైరస్ నెగిటివ్ వస్తుందని అప్పట్లో వైద్యులు తెలపడం ప్రపంచంలోనే ఆ వార్త హైలెట్ కావటం అందరికీ తెలిసిందే.
ఇది కేవలం అవసర పరీక్షలకు తప్పించి మరి దేనికి వాడకూడదని ఆ అమెరికా నియమించిన నిపుణుల కమిటీ తేల్చిచెప్పింది. మరికొన్ని రాష్ట్రాల్లో ఈ మందు వాడటం వల్ల అధిక మరణాలు సంభవిస్తున్నాయని లెక్కలు బయటపడ్డాయి. దీంతో అమెరికా వ్యాప్తంగా ఇండియా నుంచి వెళ్లిన హైడ్రోక్సీక్లోరోక్విన్ డ్రగ్ ఆపేయాలని ఆ దేశం డిసైడ్ అయ్యింది.