దేశంలో కరోనా మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తూనే ఉంది. ఇప్పటికీ దేశంలో పదివేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అదేవిధంగా వందల సంఖ్యలో మరణాలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా దేశంలో 379 మంది కరోనా తో మృతి చెందారు. ఇక గడచిన 24 గంటల్లో 16,862 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పటి వరకు దేశంలో కరోనా మహమ్మారి కారణంగా 4,51,814 మంది మృతి చెందారు. ఇక కేసులు పెరుగుతున్నా కరోనా నుండి కోరుకుంటున్న వారి సంఖ్య కూడా పెరగడం కాస్త ఊరట కలిగిస్తోంది.
గడచిన 24 గంటల్లో దేశంలో 19,331 మంది కరోనా నుండి కోలుకున్నారు. ఇదిలా ఉంటే దేశంలో ప్రస్తుతం రెండు లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక దేశంలో వ్యాక్సినేషన్ పక్రియ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్లు ఇవ్వాలన్న దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇక చాలా వరకు ప్రజలు సెకండ్ డోస్ వ్యాక్సిన్ లు కూడా తీసుకోగా కొందరు ఇప్పుడే ఫస్ట్ డోస్ వ్యాక్సిన్లను తీసుకుంటున్నారు. త్వరలో చిన్న పిల్లలకు సైతం కరోనా వ్యాక్సిన్లు ఇస్తామని కేంద్రం ప్రకటించింది.